బాబు అల్టిమేటం, ఆమరణదీక్షకు కిషన్ రెడ్డి హెచ్చరిక

పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై ముఖ్యమంత్రికి అవగాహన లేదని ఆయన అన్నారు. ప్రభుత్వ అసమర్థత పిల్లల పాలిట శాపంగా మారిందని ఆయన అన్నారు. పద్ధతి లేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ తీరు వల్ల విద్యలో ప్రమాణాలు పడిపోతాయని, విద్యార్థుల్లో ఆసక్తి తగ్గుతుందని ఆయన అన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే వాన్‌పిక్‌కు భూములు కేటాయించారని ఆయన అన్నారు. అనేక రాయితీలు ఇచ్చారని ఆయన అన్నారు. వాన్‌పిక్ ప్రాజెక్టు అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. వాన్‌పిక్‌కు భూములు ఇవ్వని వ్యక్తులను బెదిరించారని ఆయన అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నవారిని మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో యుద్ధప్రాతిపదికపై ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలపై స్పందించకపోతే తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆయన మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో హెచ్చరించారు. మంత్రులపై ఆరోపణలు వస్తున్నా గవర్నర్ స్పందించకపోవడం శోచనీయమని ఆయన అన్నారు
చేతగాని ప్రభుత్వం వల్లనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నాయని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో ప్రజాధనంతో అవినీతిని ఎదుర్కుంటున్న మంత్రులకు అధికారులకు న్యాయ సహాయం ముఖ్యమంత్రి ఎలా అందిస్తారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications