కెవిపిని ఎందుకు అరెస్టు చేయరు: ఈటెల రాజేందర్

Etela Rajender
నల్లగొండ: వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో బేతాళ మాంత్రికుడు కెవిపి రామచందర్ రావును ఎందుకు అరెస్టు చేయడం లేనది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మంత్రులు స్వేచ్ఛగా పనిచేయలేదని, వైయస్ చెప్పినట్లే నడుచుకున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు స్వచ్ఛందంగా పదవుల నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశఆరు. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులకు న్యాయసహాయం అందించడం సమంజసం కాదని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో మాట తప్పలేదని తెలుగుదేశం పార్టీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో కెవిపి రామచందర్ రావు పేరు లేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో మంత్రి ధర్మాన ప్రసాద రావు పేరు ఉందని, అందువల్ల నైతిక బాధ్యత వహించి ధర్మాన రాజీనామా చేయాలని ఆయన అన్నారు.

బునాది కాలువ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే తమ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+