వైయస్ జగన్ పార్టీ ఓ ప్రైవేట్ కంపెనీ: రాహుల్ గాంధీ

రాష్ట్రంలో బీసిలకు కాంగ్రెసు వంటి జాతీయ పార్టీలే న్యాయం చేయగలవని రాహుల్ గాంధీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీసిలకు కాంగ్రెసు పార్టీ అధిక సీట్లు కేటాయిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో కాంగ్రెసు 68 సీట్లు మాత్రమే ఇచ్చాయని, ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీలు చెరో వంద సీట్లు ఇచ్చాయని బిసి నేతలు రాహుల్‌తో చెప్పారు.
దానికి కారణాలను రాహుల్ అడిగారని, ఆస్మదీయులకు, అవినీతిపరులకు, ధనవంతులకు సీట్లు ఇవ్వడం కాంగ్రెసు పార్టీలో పరిపాటిగా ఉంటోందని తాము చెప్పామని వారు వివరించారు. ఈ విషయంలో తగిన న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల గురించి రాహుల్ తమతో దాదాపు 20 నిమిషాలు మాట్లాడినట్లు వారు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ బిసీ డిక్లరేషన్‌ను ప్రకటించి, వచ్చే ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో బీసీ నేతలు రాహుల్ గాంధీని కలిశారు.












Click it and Unblock the Notifications