కిరణ్ వల్లనే వైయస్ జగన్ పెరుగుతున్నాడు: శంకరన్న

Shankar Rao
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అవినీతిపరుడేనని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శానససభ్యుడు పి. శంకరరావు ఆరోపించారు. కెప్టెన్ సరిగా ఆడకపోతే అంతా అవుటై పోతారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మంత్రులంతా వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కెప్టెన్ జట్టులో రెండో వికెట్ పడిపోయిందని, మరో ఆరు వికెట్లు అందుకు సిద్ధంగా ఉన్నాయని ఆనయ వ్యాఖ్యానించారు.

మంత్రులకు న్యాయసహాయం అందించాలని జారీ చేసిన ఉత్తర్వును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు ఏమైనా స్వాతంత్ర్య సమరయోధులా న్యాయం సహాయం అందించడానికి అని ఆయన ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో కాంగ్రెసు టికెట్ అడిగేందుకు కూడా ఎవరూ ముందుకు రాబోరని తెలియజేస్తూ తాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీకి తాను లేఖలు రాసినట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రితో పాటు మంత్రులంతా రాజీనామా వెళ్లిపోతేనే పార్టీ ప్రక్షాళన జరుగుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ ఓటు బ్యాంకును ముఖ్యమంత్రి పతనం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సిబిఐ చార్జిషీట్ వేసిన తర్వాత అంతా వైయస్ చేశారని అంటున్నారని, ఇన్నాళ్లు ఏం చేశారని ఆయన అన్నారు. తాను అవినీతి మీద పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి అవినీతికి వత్తాసు పలుకుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి మీద కూడా అభియోగాలున్నాయని ఆయన అన్నారు.

నెహ్రూ కుటుంబం ఓటు బ్యాంకుకు గండి పడకూడదని, స్వచ్ఛమైన అవినీతిరహిత ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కెప్టెన్ సరిగా ఆడకపోతే అంతా అవుటైపోతారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బలహీనవర్గాలకు, బీసీలకు వ్యతిరేకమని, రెడ్లకు మాత్రమే అనుకూలమని ఆయన అన్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో చట్టం తన పని చేయకూడదని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ప్రమేయం వల్లనే వైయస్సార్ కాంగ్రెసు పెరుగుతోందని ఆయన అన్నారు. పార్టీ వల్ల కిరణ్ కుమార్ రెడ్డి బాగుపడ్డారు గానీ కిరణ్ కుమార్ రెడ్డి వల్ల పార్టీకి ఏ విధమైన ప్రయోజనం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+