వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ముంబయి బార్ గర్ల్స్ పట్టివేత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mumbai police's social sevrvice branch detained the women who were about to board an Air India flight to Dubai
ముంబయి/న్యూఢిల్లీ: అరబ్ దేశాలలో యువతులకు ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలన్న ఓ ముఠా గుట్టు రట్టయింది. బుధవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజిఐఏ)లో 37 మంది బార్ గర్ల్స్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డ్యాన్సర్లుగా వీరిని దుబాయ్‌కు పంపిస్తున్న మధ్యవర్తుల కోసం ముంబయి పోలీసులు గాలిస్తున్నారు.

మంగళవారం రాత్రి 8.25 గంటలకు దుబాయ్ వెళ్లే విమానంలో ముంబయికి చెందిన 37 మంది బార్ గర్ల్స్ ప్రయాణించాల్సి ఉందని, ఆ యువతులంతా డ్యాన్సర్లుగా చలామణి అవుతూ గమ్యం చేరుకోగానే మధ్యవర్తులు వీరిని బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపుతారని ముంబయి పోలీసు సామాజిక సేవా విభాగం అధికారి ఒకరు తెలిపారు.

విషయం తెలుసుకున్న ముంబయి ఎసిబి వసంత్ డోబ్లే ఈ ముఠా గుట్టు రట్టు చేశారన్నారు. అరబ్ దేశాలలో ముంబయి బార్ గర్ల్స్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. మరోవైపు వారికిదే ఆదాయ వనరు కావడంతో విదేశాలకు వెళ్లేందుకు వారూ మొగ్గు చూపుతుంటారు. విమానాశ్రయంలోని కొందరు అధికారులతో గల్ఫ్ ఏజెంట్లకున్న సంబంధాల వల్ల వీరి వాస్తవికతను తనిఖీ చేయకుండా వీసాలు క్లియర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

2005 నుండి మహారాష్ట్ర ప్రభుత్వం డ్యాన్స్ బార్లను నిషేధించింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు కఠినంగా వ్యవహరించడం వల్ల వీరిని ఢిల్లీ, చెన్నై, హైదరాబాదు మీదుగా విదేశాలకు పంపడం ప్రారంభించారు. పోలీసు బిల్లును ఆమోదించడం ద్వారా డ్యాన్స్ బార్లను మూసివేయించినప్పటిక ఆ మహిళలకు జీవనోపాధి కల్పించడంలో మాత్రం సర్కారు విఫలమైంది.

English summary
A Social Service (SS) branch team headed by ACP Vasant Dhoble last evening busted a flesh trade syndicate and rescued 37 Mumbai-based bar girls who were about to board a flight to Dubai from Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X