పాక్‌లో భారత ఖైదీ సరబ్‌జిత్ సోనియా గాంధీకి లేఖ

సోనియా గాంధీ అడ్రస్‌తో అతను ఓ లేఖ రాశారు. జైలు అధికారులు తనకు తినేందుకు ఏమాత్రం పనికి రాని ఆహారాన్ని జైలు అధికారులు పెడుతున్నారని సరబ్ తన లేఖలో ఆరోపించారు. అంతేకాకుండా తనను అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. సరబ్ జిత్ సింగ్‌కు పాకిస్తాన్ ఉరి శిక్ష వేసింది.
సరబ్ ఉరి శిక్షను రద్దు చేయాలని అతని తరఫున ఇటీవల పాకిస్తాన్ అధ్యక్షుడి వద్ద మెర్సీ పిటిషన్ దాఖలు చేసిన అవేష్ షేక్ అనే వ్యక్తి ఈ లేఖను భారత్‌తు తీసుకు వచ్చారు. సరబ్ ఈ అవేష్ షేక్ ద్వారా పలు లేఖలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి, సోదరి దల్బీర్ కౌర్‌కు, కూతురు పూనంకు పంపారు.
తనకు పెట్టే ఆహారంలో తన హెల్త్‌ను దెబ్బతీసే పదార్థాలు ఉండవచ్చునని సరబ్ సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తన ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోందని, తనకు ఇచ్చే ఆహారంలో ఏదో కలపడం వల్లే ఇలా జరుగుతోందంటూ సరబ్‌జిత్ తన లేఖలో పేర్కొన్నారు. తన పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ ఆహారం కారణంగా తన ఓ కాలులో నొప్పి రోజు రోజుకు పెరుగుతోందని చెప్పారు. ఇటీవల అవేష్ షేక్ జైలులో సరబ్‌ను కలిశారు. అప్పుడు అతను కూడా సరబ్‌కు పెట్టిన భోజనాన్ని రుచి చూశాడు. అది మనుషులు తినేలా లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications