వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధర్మానకు కిల్లి కృపారాణి బాసట: సోనియాతో భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Killi Kruparani
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్న మంత్రి ధర్మాన ప్రసాద రావుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు కిల్లి కృపారాణి బాసటగా నిలిచారు. ధర్మాన కోసం ఆమె ఢిల్లీలో లాబియింగ్ ప్రారంభించారు. ధర్మానను కాపాడాలని కోరుతూ ఆమె శనివారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, కేంద్ర మంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవిలను కలిశారు.

ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెసు పార్టీకి ముఖ్యమైన నాయకుడని, అందువల్ల దర్మానను కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె ఢిల్లీ పెద్దలతో అన్నారు. ధర్మాన కోసం శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంగ్రెసు నాయకులు రెండు మూడు రోజుల్లో అధిష్టానం పెద్దలను కలిసే అవకాశం ఉంది.

చేనేత పరిశ్రమ బడా వ్యాపారుల చేతుల్లోకి పోతుందని, ప్రభుత్వ కార్యాలయాలు, టిటిడిలో చేనేత వస్త్రాలు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి పనబాల లక్ష్మీ అన్నారు. శనివారం ఉదయం ఆమె గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ మంత్రులను టీడీపీ ఎంపీలు విమర్శించడం సరికాదన్నారు. లోక్‌సభలో ప్రజాసమస్యలపై టీడీపీ ఎంపీలు ఏ మేరకు ప్రస్తావిస్తున్నారో ఆత్మవిమర్శచేసుకోవాలని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి వ్యాఖ్యానించారు.

పలువురు మంత్రులు ధర్మానకు మద్దతు ప్రకటిస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఆయనకు అండగా నిలుస్తున్నారు. అయితే, ఒక వర్గం మాత్రం ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించాల్సిందేనని వాదిస్తోంది.

English summary
MP Killi Kruparani is lobbying for minister Dharmana Prasad rao, accused in YSR Congress president YS Jagan DA case, in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X