ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటిలాంటివారికే, బాబు చెప్తారు: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
ఖమ్మం: ప్రభుత్వం సాధించినట్లు చెప్పుకుంటున్న గ్యాస్ వల్ల కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటిలాంటి వారికే ప్రయోజనం చేకూరిందని, దాని వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వబోతున్నారని ఆయన అన్నారు.

తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరి స్పష్టం చేయాలని తెలంగాణ కోదండరాం డిమాండ్ చేశారు. ఖమ్మంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణపై ఏ నిర్ణయమూ ప్రకటించకపోతే కాంగ్రెస్ ఖతమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. తాము నిర్వహించనున్న మిలియన్ మార్చ్ ద్వారా తెలంగాణలోని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు, వివిధ ఉద్యమశక్తులను మరింతగా ఐక్యం చేసి తెలంగాణ సాధించే దిశగా పోరాటాన్ని ఉదృతం చేయబోతున్నామని ఆయన చెప్పారు.

తమ పోరాటం ద్వారా కాంగ్రెస్‌పై మరింత ఒత్తిడి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం కూడా స్పష్టమైన వైఖరి ప్రకటించబోతోందని, ఇక కాంగ్రెసే తన నిర్ణయాన్ని స్పష్టంచేయాలని ఆయన అన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ఉధృతంగా నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించామని తెలిపారు.ఈ మిలియన్ మార్చ్ ద్వారా ఆయా జిల్లాల స్థానిక సమస్యలను కూడా తెలియజేస్తామని చెప్పారు.

ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటలో జిల్లాకు సంబంధించిన వాటిపై హామీలు పెద్దగా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇక్కడ బొగ్గు పెద్ద ఎత్తున లభిస్తున్నప్పటికీ విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంపై హామీనివ్వలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణలోని గిరిజన గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఈ ముంపు నుంచి గిరిజనులకు నష్టం లేకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు స్పష్టం చేయలేదని చెప్పారు.

మీడియా సమావేశంలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, జేఏసీ నాయకులు రంగరాజు, వెంకటపతిరాజు, జాన్‌మియా, బీజెపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

English summary
Telanagana political JAC chairaman Kodandaram said that leaders like Lagadapati Rajagopal have benifitted by gas allocations. He said Telugudesam is going to make statement on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X