హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వికలాంగులపై టిడిపి అధినేత బాబు హామీల వర్షం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: వికలాంగులపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరాల వర్షం కురిపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పేదరికానికి తోడు వికలాంగులైతే తల్లిదండ్రులకు మరింత కష్టమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను అధిగమించే మనో ధైర్యం ప్రభుత్వం ఇవ్వాలని చంద్రబాబు కోరారు.

తన నివాసంలో వికలాంగులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మంగళవారం ఉదయం చంద్రబాబునాయుడు మాట్లాడారు. వికలాంగులకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. వారి పెన్షను వెయ్యి నుంచి రూ. 1500 లకు పెంచుతామని చంద్రబాబు చెప్పారు. వికలాంగులను వివాహం చేసుకుంటే లక్ష ప్రోత్సాహం అందజేస్తామని చెప్పారు. వికలాంగుల కోసం సబ్‌ప్లాన్ తీసుకొస్తామని ఆయన చెప్పారు.

మాదిగలు, మాదిగ ఉపకులాలకు సమన్యాయం చేసింది తమ పార్టీయేనని చంద్రబాబు తెలిపారు. తమ పార్టీ ప్రభుత్వ హయాంలో 3 వేల మంది వికలాంగులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించామని ఆయన గుర్తు చేశారు. వికలాంగుల పట్ల ప్రభుత్వం మానవతాదృక్పథం చూపాలని చంద్రబాబు కోరారు.

కాగా. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రితో మంత్రుల భేటీ జగన్నాటకంలో భాగమే అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. మంత్రులపై వేటు పడితే జగన్ కేసు బలపడుతుందని, అందుకే మంత్రుల ద్వారా జగన్‌ను కాపాడేందుకు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి యత్నిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.

English summary
Telugudesam party president N Chandrababu Naidu made several promises to physically handicapped. He said separate ministry will be created for physically handicapped, if TDP comes into power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X