హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు వైయస్ విజయమ్మ లేఖ: టిడిపిపై బాజిరెడ్డి ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bajireddy Goverdhan Reddy
హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికలలో అసెంబ్లీలో బిసిలకు వంద స్థానాలు కేటాయిద్దామంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ రాసిన బహిరంగ లేఖకు వక్రభాష్యం చెప్పొద్దని టిడిపి నేతలకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హితవు పలికింది. దీంతో విషయాన్ని పక్కదారి పట్టించి ప్రజలను మోసం చేయవద్దని ఆ పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయమ్మ లేఖపై టిడిపి నేతలు స్పందించిన తీరు గుమ్మడి కాయల దొంగఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. బిసిల వల్ల చంద్రబాబు లబ్ధి పొందారే కానీ, ఆయన వల్ల బిసిలు ఎన్నడూ లబ్ధి పొందలేదని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాటలు, మాయలతో జనాన్ని మోసం చేసి, అధికారం కోల్పోయాక డిక్లరేషన్ ప్రకటిస్తే ఎవరు నమ్ముతారని, ఇది బిసిలను మరోసారి మోసం చేసే డ్రామా అని విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్, ఇతర పార్టీలకు నిజాయితీ ఉంటే అసెంబ్లీలో బిసిలకు వంద స్థానాలు కల్పించడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై తమ పార్టీ ఈనెల 24న బిసి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల వైయస్ విజయమ్మ బిసిలకు అసెంబ్లీలో వంద స్థానాలు కేటాయిస్తామని చంద్రబాబుకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.

English summary
YSR Congress party leader Bajireddy Govardhan Reddy lashed out at Telugudesam party leaders for blaming YS Vijayamma on BC declaration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X