రాజేష్ ఖన్నా ఆత్మ క్షోభిస్తుంది: అనితా అద్వానీ

భవనం పేరు మార్పు చెలరేగుతున్న ఊహాగానాలు నిజమైతే రాజేష్ ఖన్నా ఆత్మ క్షోభిస్తుందని ఆమె అన్నారు. భవనానికి ఆశీర్వాద్ అనే పేరు ఎలా పెట్టారనే విషయాన్ని గుర్తు చేసుకుని కాకాజీ తనకు చెబుతూ ఉండేవారని ఆమె అన్నారు. రాజేష్ ఖన్నా తండ్రి తీవ్రంగా ఆలోచించి ఆశీర్వాద్ అనే పేరు పెట్టారని ఆమె అన్నారు. నువ్వో తారవు అవుతావని, ప్రజలు అభిమానంతో లేఖలు రాస్తారని తన తండ్రి అంటుండేవారని రాజేష్ ఖన్నా తనతో అన్నట్లు ఆమె చెప్పారు.
రాజేష్ ఖన్నా ఆశీర్వాద్ అని అభిమానులు లేఖలు రాస్తారని తన తండ్రి అంటుండేవారని ఆమె అన్నారు. వారంతా ఎల్లవేళలా ఆశీర్వాదిస్తుంటారని, అందుకే ఆ పేరు భవనానికి పెట్టామని చెబుతుండేవారని ఆమె గుర్తు చేశారు. తన తండ్రి పెట్టిన అత్యంత ఇష్టమైన పేరు ఇది అని కాకాజీ అంటుండేవారని ఆమె చెప్పారు. దాన్ని మ్యూజియంగా మార్చడానికి తగిన విధంగా మార్పులు చేస్తూ వచ్చారని ఆమె అన్నారు.
అకస్మాత్తుగా భవనం పేరు మార్చాల్సిన అవసరం ఏం వచ్చిందని, కొత్త పేరు కూడా అంత వినసొంపుగా లేదని ఆమె అన్నారు. భవనంలో అద్వానీ వాటా కోరినట్లు వచ్చిన వార్తలను ఆమె అధికార ప్రతినిధి దాలే భగ్వార్ స్పష్టం చేశారు. తన అభిమానుల కోసం దాన్ని మ్యూజియంగా మార్చాలని రాజేష్ ఖన్నా భావించారనేది మాత్రం ఆమె భావన అన్నారు.












Click it and Unblock the Notifications