హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారతి, బ్రాహ్మిణికి ఇచ్చారు: వైయస్‌పై దేవినేని ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devineni Umamaheswara Rao
హైదరాబాద్: కృష్ణా డెల్టాకు రావాల్సిన నీటిని దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తన తనయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీ భారతి సిమెంట్స్‌కు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కంపెనీ బ్రాహ్మణీ స్టీల్స్‌లకు తరలించారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం మండిపడ్డారు. ఈ నెల 25న ప్రకాశం బ్యారేజీ వద్ద మహాధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

కృష్ణా జిల్లా రైతాంగానికి నీరు ఇవ్వకుండా ముఖ్యమంత్రి ఇందిర బాటలు వేస్తున్నారని, శ్రీశైలం రిజర్వాయర్‌లో 84 టిఎంసిల నీటితో విద్యుదుత్పత్తి చేసుకోవచ్చునని చెప్పారు. విద్యుదుత్పత్తి కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయలేకపోతున్నారని ఆరోపించారు. హైకోర్టు తీర్పును అడ్డు పెట్టుకొని ప్రభుత్వం నిద్ర పోతోందన్నారు. రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నీటి కోసం మాది బతుకు పోరాటమన్నారు.

డెల్టాలో మెట్ట పంటలు వేసుకోవాలంటూ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని మరో నేత దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. రైతులు పంటలను కోల్పోతున్నా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు. డెల్టాకు నీరు ఇస్తామని చెప్పిన కాంగ్రెసు నేతలు ఇప్పుడు అడ్రస్‌కు లేరన్నారు. ప్రభుత్వం వైఖరి వల్లే తాగునీటిపై హైకోర్టు ఏకపక్ష నిర్ణయం వెలువడిందన్నారు. ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయక పోవడం దారుణమన్నారు. ఇది అసమర్థ ప్రభుత్వమన్నారు.

English summary
Telugudesam Party senior MLA Devineni Umamaheswara Rao blamed late YS Rajasekhar Reddy that he was gave delta water to Bharati cements and Brahmani steels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X