బంగారం ధరల్లో అనూహ్యం- తలకిందులు
అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాలు, మదుపరుల అంచనాల నేపథ్యంలో శనివారం నాడు బంగారం ధరలు పెరిగాయి అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉండటం, యూఎస్ ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గినట్లు వచ్చిన గణాంకాలు పసిడి ధరలపై ఒత్తిడిని పెంచాయి. గ్లోబల్ మార్కెట్‌లో చోటుచేసుకున్న ఈ మార్పుల వల్ల దేశీయంగా కూడా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు నమోదయ్యాయి.
అమెరికాలో స్పాట్ బంగారం ధర 0.3 శాతం పెరిగి 4,201.61 డాలర్ల వద్ద ట్రేడవ్వగా, అంతర్జాతీయంగా వీటి ధరలు 4,200 డాలర్ల దిగువకు పడిపోయాయి. వెండి ధర కూడా 0.61 శాతం పెరిగింది. 67.20 డాలర్ల వద్దకు చేరింది. అయినప్పటికీ ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైన అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి ముందున్న ధరలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం దాదాపు అయిదో వంతు తక్కువధరకు లభిస్తుండటం గమనార్హం.

భారత్ లో బంగారం ధరల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 1,50,620 రూపాయలకు చేరింది. 22 క్యారెట్లు 10 గ్రాములకు 1,38,068 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 18 క్యారెట్లు 1,12,965 రూపాయల వద్ద స్థిరపడింది. 999 స్వచ్ఛత గల వెండి కిలో ధర 2,47,160 రూపాయలు పలుకుతోంది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ. 1,50,360 22 క్యారెట్లు రూ. 1,37,830, 18 క్యారెట్లు రూ. 1,12,770, వెండి రూ. 2,46,730లు.
బెంగళూరులో 10 గ్రాముల పసిడి రూ. 1,50,730, 22 క్యారెట్లు రూ. 1,38,169, 18 క్యారెట్లు రూ. 1,13,048, వెండి రూ. 2,47,350 ల వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,050, 22 క్యారెట్లు రూ. 1,38,463, 18 క్యారెట్లు రూ. 1,13,288, వెండి రూ. 2,47,880, హైదరాబాద్ లో 24 క్యారెట్లు రూ. 1,50,850, 22 క్యారెట్లు రూ. 1,38,279 18 క్యారెట్లు రూ. 1,13,138, వెండి రూ. 2,47,550లుగా నమోదైంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,120 మేర పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా డాలర్ విలువలో మార్పులు దేశీయంగా బంగారం, వెండి ధరలను శాసిస్తున్నాయి. మున్ముందు ఫెడరల్ రిజర్వు తీసుకునే నిర్ణయాలు, ద్రవ్యోల్బణ పరిస్థితుల ఆధారంగా పసిడి ధరలు మరింత హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పసిడి ప్రియులు, రిటైలర్లు, పెట్టుబడిదారులు మార్కెట్ ఒడిదుడుకులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం అవసరమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications