టార్గెట్ జగన్: అందుకే మంత్రుపై కాంగ్రెసు కఠినంగా

YS Jagan
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యం చేసుకున్నందు వల్లనే కేసుతో సంబంధం ఉన్న మంత్రుల పట్ల గానీ అధికారుల పట్ల గానీ మెతకవైఖరి కూడదనే అభిప్రాయానికి కాంగ్రెసు అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇరుక్కున్న మంత్రులకు, ఐఎఎస్ అధికారులకు న్యాయసహాయం అందించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపైనే వ్యతిరేకత ఎదురవుతోంది. ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించకపోవడంపై ఇప్పటికే విమర్శలు ప్రారంభమయ్యాయి.

ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించకపోతే వైయస్ జగన్ పట్ల కాంగ్రెసు అధిష్టానం మెతక వైఖరి అవలంభిస్తోందనే అభిప్రాయం బలపడే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మిగతా మంత్రుల పట్ల కూడా ధర్మాన ప్రసాద రావు పట్ల అనుసరించిన వైఖరే అవలంబించాలని అధిష్టానం భావించింది. అయితే, ఏకంగా నలుగురు మంత్రులు కన్నా లక్ష్మినారాయణ, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రా రెడ్డి, గీతా రెడ్డిలపై వేటు వేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. వీరిపై వేటు వేయడం వల్ల జగన్ పట్ల తాము మెతక వైఖరి అవలంబించడం లేదనే సంకేతాలను పంపడంతో పాటు అవినీతిని సహించబోమని చెప్పుకునే అవకాశం కూడా కలుగుతుందని కాంగ్రెసు అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది.

ఒక్క ధర్మాన వ్యవహారంతోనే ఇది ముగిసిపోయే అవకాశాలు లేకపోవడంతో ముఖ్యమంత్రి అధిష్టానం ఆదేశాల కోసం చూశారు. మరోవైపు, రాజీనామాను ఆమోదించకూడదని సహచర మంత్రుల నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. దీంతో ఆయన కాంగ్రెసు అధిష్టానం ముఖ్యమంత్రిని ఢిల్లీ పిలిపించి పూర్తి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు నిష్కళంకకంగా వెళ్లడానికి ప్రస్తుత చర్యలు ఉపయోగపడుతాయని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మంత్రులను వదిలేస్తే వైయస్ జగన్‌పై కేసు కూడా వీగిపోతుందని ముఖ్యమంత్రి న్యాయనిపుణులు ఇచ్చిన నివేదిక తెలిపినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వైయస్ జగన్ కోరుకునేది కూడా అదే. మంత్రులు కేసులో ఇరుక్కున్నప్పటి నుంచి వైయస్ జగన్ బయటపడతారనే ప్రచారాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముమ్మరం చేసింది. తన పార్టీవారిని కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెసు అధిష్టానం పట్టు సడలిస్తే తనకు వెసులుబాటు దొరికే అవకాశం ఉందని వైయస్ జగన్ భావించినట్లు చెబుతున్నారు.

ధర్మాన రాజీనామాను అడ్డం పెట్టుకుని మిగతా కళంకిత మంత్రులు బయటపడాలని ఎత్తులు వేసినట్లు కాంగ్రెసు అధిష్టానం గుర్తించినట్లు చెబుతున్నారు. నలుగురు మంత్రులపై తక్షణమే వేటు పడుతుందా, లేదా అనేది స్పష్టంగా తేలడం లేదు. తాత్కాలికంగా ధర్మాన ప్రసాదరావు రాజీనామా ఆమోదంతో సరిపెట్టి తర్వాత సమూలమైన మార్పులకు అధిష్టానం పూనుకుంటుందా అనేది కూడా చెప్పలేని స్థితి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+