జగన్‌పై, వైయస్‌పై ఎందుకంటే: ఆనంపై ఎంపీ మేకపాటి

తమ పార్టీ నేతలను విమర్శిస్తున్న ఆనంకు ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. ఆనం సోదరుల ప్రవర్తన ఏరుదాటాక తెప్ప తగలేసే విధంగా ఉందని మండిపడ్డారు. ఆనం వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమే తప్ప మరొకటి కాదన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా రాష్ట్ర కేబినెట్ మొత్తం ఢిల్లీలో వాలిందని, ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భావనంతోనే సేఫ్ సైడ్‌గా ఆనం జగన్, వైయస్సార్ పైన విమర్శలు గుప్పించారన్నారు.
రాష్ట్రంలో ఎవరు నాయకత్వం చేపట్టినా కాంగ్రెసు నావను గట్టెక్కించలేదని అన్నారు. కాగా రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రితో భేటీ అనంతరం ఆనం జగన్ పైన తీవ్రస్థాయిలో మండిపడుతూ.. విజయమ్మకు పలు ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకున్నారని, అందుకు విజయమ్మ ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications