వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవి నోట బిసి మాట, నోకామెంట్... ధర్మానపై బొత్స

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi - Botsa Satyanarayana
హైదరాబాద్/విజయనగరం: ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం నివేదిక రూపొందించిన మాదిరిగా బిసిల కోసం కూడా ప్రత్యేక ఉప ప్రణాళిక తీసుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఆదివారం అన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన నివేదిక పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ నిధులు దుర్వినియోగం కాకుండా ఉపయోగపడేలా నివేదిక తయారు చేయడం చరిత్రాత్మకం అన్నారు.

ఈ నివేదికకు చట్టబద్దత కల్పిస్తే ఎస్సీ, ఎస్టీల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. బిసిలకు కూడా ఉప ప్రణాళిక తీసుకు రావాలని, దాంతో పాటే చట్టసభల్లో బిసిలకు అత్యధిక సీట్లు కేటాయించే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ బిసి డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా బిసిలకు వంద సీట్లు ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామాపై తాను ఏమీ మాట్లాడనని, ఆ వ్యవహారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చూసుకుంటారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం విజయనగరం జిల్లాలో అన్నారు. ప్రస్తుతం విద్యుత్ కోతలు కాస్త తగ్గుముఖం పట్టాయని, త్వరలో పరిస్థితిని మరింత మెరుగు పరుస్తామని చెప్పారు. ఆర్టీసి రూ.206 కోట్ల నష్టాలలో ఉందని, దీనిని అధిగమించేలా కృషి చేస్తామన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్సుకు కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని, వారితో చర్చిస్తామన్నారు.

English summary
Rajyasabha Member Chiranjeevi has praised ministers committee for ther SC and ST sub plane. He was expected to sub plane to BCs also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X