విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారికంత తెలివి లేదు, టిడిపియే ఇచ్చింది: లగడపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: వేర్పాటువాదులకు కోర్టులకు వెళ్ళేంత తెలివి లేదని, జలాశయాల నుంచి నీరు విడుదల చేసే జివో 69ను తెలుగుదేశం పార్టీయే వాళ్లకు ఇచ్చి కోర్టులో పిటిషన్ వేయించిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ శనివారం ఆరోపించారు. విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1996లో జివో 69ని టిడిపి విడుదల చేసినప్పటికీ వేర్పాటువాదులు కోర్టులో వేసేంత వరకూ అటువంటి జివో ఒకటుందని ఎవరికీ తెలియదన్నారు.

రాజకీయ అవసరాల కోసం టిడిపి వాళ్ళే దాన్ని ఇచ్చి, ఇప్పుడు డెల్టాకు నీరు అంటూ రోడ్డెక్కి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.టిడిపికి నిజంగా డెల్టా రైతులపై అభిమానం ఉంటే కోర్టులో ఇప్పటి వరకు ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, వైయస్సార్ కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీలలో ఎవరికి డెల్టాను గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. సోమవారం డెల్టాకు నీరు విడుదల అవుతుందని, కోర్టులో ప్రభుత్వం తరఫున వాదించేందుకు తన వ్యూహం తనకు ఉందని చెప్పారు.

రాష్ట్రం కలిసి ఉంటేనే వేర్పాటువాదులు ఇలా కోర్టులలో దావాలు వేసి నీరు ఆపేస్తే, ఇక విడిపోతే సంగతేమిటని లగడపాటి ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ మహాధర్నా పూర్తి ఫ్లాఫ్ అయిందని, 400 మంది రైతులు కూడా రాలేదని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆరోపించారు. రైతులు స్వచ్ఛందంగా తరలి రావాలి గానీ, వారిని గుడివాడ నుంచి లారీలలో తరలించడమేమిటని ఆరోపించారు. డెల్టాకు నీరిచ్చే విషయంలో ప్రభుత్వం అన్ని రకాలు చర్యలు తీసుకుంటుందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.

English summary
Vijayawada MP Lagadapati Rajagopal has blamed Telugudesam 
 
 party about 69 GO issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X