గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తాడోపేడో: సోనియాను కలిశాకే నిర్ణయం... రాయపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi - Rayapati Sambasiva Rao
గుంటూరు: తనకు పార్టీపై ఎలాంటి అసంతృప్తి లేదని గుంటూరు పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివ రావు ఆదివారం అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి వరించక పోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే వార్తల నేపథ్యంలో రాయపాటి ఉదయం తన కార్యకర్తలతో సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, కానీ తన కార్యకర్తల నుండి మాత్రం ఒత్తిళ్లు వస్తున్నాయన్నారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యాక మిగిలిన విషయాలు మాట్లాడతానని చెప్పారు. తాను రాజీనామా చేయడం లేదని, అధిష్టానంతో మాట్లాడిన తర్వాతే నిర్ణయం ఉంటుందని చెప్పారు.

కాగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గిరిని పార్టీ అధిష్టానం మరోసారి కనుమూరి బాపిరాజుకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నో ఏళ్లుగా పార్టీలో ప్రాధాన్యత కోసం తపిస్తున్న రాయపాటికి మరోసారి చేదు అనుభవం ఎదురయింది. టిటిడి చైర్మన్ పదవి రేసులో ఆయన పేరు పలుమార్లు వినిపించింది. చివరి నిమిషంలో వేరే వాళ్లకు అది వస్తోంది. గతంలో కూడా రాయపాటి పేరు ప్రధానంగా వినిపించింది. కానీ కనుమూరికి అప్పుడు పట్టం గట్టారు.

అప్పుడే కాంగ్రెసు పార్టీ పైన రాయపాటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సోనియా గాంధీ అతనితో మాట్లాడాక కూల్ అయ్యారు. అయితే వచ్చేసారి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అందువల్లే రాయపాటి మౌనం వహించారని అంటున్నారు. కానీ సోనియా హామీ ఇచ్చినప్పటికీ ఈసారి కూడా పదవి రాకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతోనూ, అవమానంగానూ ఫీల్ అవుతున్నారట. అందుకే శనివారం రాత్రి నుండి ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారనే వార్తలు వచ్చాయి.

కాగా పార్టీలో తనకు పదవులు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాయపాటి ఆదివారం తన కార్యకర్తలతో భేటీ అయ్యారు. రాయపాటి, ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ వేర్వేరుగా కార్యకర్తలతో భేటీ అయి వారి అభిప్రాయాలను తీసుకున్నట్లుగా సమాచారం. రాయపాటి త్వరలో సోనియాను కలిసే అవకాశముంది.

English summary
Guntur MP Rayapati Sambasiva Rao said that he will respond after meet AICC president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X