వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని, సోనియా ఇళ్ల ముట్టడి యత్నం: కేజ్రీవాల్ అరెస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Arvind Kejriwal
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణాన్ని నిరసిస్తూ ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే బృందంలోని వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలో ఆదివారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ ఇళ్ల నివాసాలను ముట్టడించేందుకు ఇండియా ఎగైనెస్ట్ కార్యకర్తలు యత్నించారు. ఈ సందర్భంగా పార్లమెంటు స్ట్రీట్‌లో పోలీసులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. బొగ్గు కుంభకోణాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ తొలుత జంతర్ మంతర్ వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

అనంతరం ర్యాలీగా ప్రధాని నివాసం వైపు వెళ్లారు. బారీకేడ్లు దాటుకొని పార్లమంటు భవనం వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు వాటర్ కేనన్లు, బాష్పవాయువును ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పార్లమెంటు స్ట్రీట్‌లో ఆందోళన చేస్తున్న కేజ్రీవాల్‌ను, ప్రశాంత్ భూషణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వదిలి పెట్టారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడారు. అవినీతిలో అధికార కాంగ్రెసు, ప్రతిపక్ష బిజెపి రెండు సమానమేనని అని ఆరోపించారు. రాజకీయాల పేరుతో వ్యాపారం నడుపుతున్న వారి పేర్లను బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మరోసారి ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు వెళ్లిన కేజ్రీవాల్‌ను పోలీసులు రెండోసారి అదుపులోకి తీసుకున్నారు. కేజ్రీవాల్ బృందం నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగాయి. మరోవైపు భారీ ఎత్తున మహిళా ఆందోళనకారులు సోనియా నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేయడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్ చేశారు. సోనియా, మన్మోహన్, గడ్కరీ నివాసాల వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

English summary
Two crucial former Team Anna members - Arvind Kejriwal and Prashant Bhushan have been detained outside Congress office in New Delhi on Sunday, Aug 26. This was the second time when Kejriwal has been detained on the same day for protesting against prime minister Manmohan Singh and against several other political leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X