ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు: శోభానాగిరెడ్డి, బాబు పైనా ఫైర్

Shoba Nagi Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెసు పార్టీ నేతలు అందరూ తమ తమ పదవులు కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి సోమవారం విమర్శించారు. అసెంబ్లీ కమిటీ హాలులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్షం ఉదయం భేటీ అయింది. అనంతరం శోభా నాగి రెడ్డి మాట్లాడారు. ఎడాపెడా విద్యుత్ కోతలతో రాష్ట్రం అంధకారంలో మగ్గుతోందన్నారు.

కరెంట్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెసు నేతలు పదవుల కోసం ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారు. కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర నేతలు విఫలమయ్యారన్నారు. పొరుగు రాష్ట్రాలను చూసి కిరణ్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలని శోభా నాగి రెడ్డి హితవు పలికారు. ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు.

అధికారమే పరమావధిగా బాబు వ్యవహారశైలి ఉందన్నారు. నేడు రాష్ట్రంలోని విద్యుత్ సమస్యలకు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాలే కారణమన్నారు. కాంగ్రెసు నేతలు వి.హనుమంత రావు, తులసి రెడ్డిలు అవాకులు, చెవాకులపై తాను ఏమాత్రం స్పందించనన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విహెచ్ లాంటి నేతలకు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. ముఖ్యమంత్రిని తాము రేపు కలిసి శాసనసభా పక్షాన్ని సమావేశపర్చాలని కోరుతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+