వైయస్ విజయమ్మ వ్యాఖ్యలు: అవునన్న శంకర రావు

P Shankar Rao
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని మాజీ మంత్రి శంకర రావు సోమవారం అన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తున్న మంత్రులు ఆయన సజీవంగా వచ్చి ఎదురుగా నిలబడితే ఆయన కళ్లలోకి సూటిగా చూడగలరా అని ఆదివారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. దీనిపై శంకర రావు స్పందించారు.

వైయస్ బతికొస్తే ఆయన కళ్లలోకి చూసే ధైర్యం మంత్రులకు లేదని అన్నారు. అవినీతిలో మంత్రులకు బాధ్యత ఉందన్నారు. వారు తప్పు చేసి ఇతరుల పైకి ఆ తప్పును నెట్టాలని చూడటం సరికాదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శిస్తే పార్టీకి చేదు అనుభవం ఎదురవుతుందన్నారు. గతంలో ఆయనను దూషించడం వల్లనే ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఓటమి పాలైందన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కాంగ్రెసు పార్టీకి కనువిప్పు కలగక పోవడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పసిపిల్లల ప్రాణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

కాగా వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, ఆయనను విమర్శిస్తున్న నాయకులకు వైయస్ బతికి వస్తే ఆయన కళ్లలోకి సూటిగా చూసే దమ్ము, ధైర్యం ఉందా..? అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. షామీర్‌పేట మండలం జవహర్‌నగర్‌లో గడపగడపకు వైయస్సార్ కాంగ్రెసు కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

అక్కడి బహిరంగ సభాస్థలికి వెళ్లడానికి ముందుగానే వైఎస్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసేటట్లు కార్యక్రమాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు. కానీ వాహనం దిగిన వెంటనే ఆమె తన అనుచరులతో కలిసి విగ్రహం ముందు నుంచే సభా వేదికకు చేరుకున్నారు. వైయస్ విగ్రహానికి పూలమాలలు వేయకుండా బహిరంగ సభా వేదికపైకి ఆమె వెళ్లడంపై జవహర్‌నగర్ ఉపసర్పంచ్ ఆర్.నర్సింహాగౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం ఉపసర్పంచ్ భార్య ఆర్.నాగలక్ష్మితో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేయించి నివాళులర్పించారు. అంతకు ముందు బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని, రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా? అని ఆమె ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పధకం అనారోగ్యశ్రీ పథకంగా మారిందని, 104, 108 సర్వీసులు అసలు పని చేయడం లేదని ఆమె అన్నారు. ఎందరో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో స్పందన లేదని ఆరోపించారు.

తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సన్నని వైరులా ఉన్నా ప్రభుత్వానికి, ఇతర పార్టీలకు షాకు ఇస్తున్నట్టుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సిని హీరోయిన్ రోజా విమర్శించారు. జగన్‌కు రాహు, కేతువుల్లా కాంగ్రెస్, టీడీపీలు అడ్డుపడుతున్నాయని ఆమె ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+