వైయస్ బతికొస్తే కళ్లలోకి చూసే దమ్ముందా: విజయమ్మ

అక్కడి బహిరంగ సభాస్థలికి వెళ్లడానికి ముందుగానే వైఎస్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసేటట్లు కార్యక్రమాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు. కానీ వాహనం దిగిన వెంటనే ఆమె తన అనుచరులతో కలిసి విగ్రహం ముందు నుంచే సభా వేదికకు చేరుకున్నారు. వైయస్ విగ్రహానికి పూలమాలలు వేయకుండా బహిరంగ సభా వేదికపైకి ఆమె వెళ్లడంపై జవహర్‌నగర్ ఉపసర్పంచ్ ఆర్.నర్సింహాగౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం ఉపసర్పంచ్ భార్య ఆర్.నాగలక్ష్మితో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేయించి నివాళులర్పించారు. అంతకు ముందు బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని, రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తుందా? అని ఆమె ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పధకం అనారోగ్యశ్రీ పథకంగా మారిందని, 104, 108 సర్వీసులు అసలు పని చేయడం లేదని ఆమె అన్నారు. ఎందరో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వంలో స్పందన లేదని ఆరోపించారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సన్నని వైరులా ఉన్నా ప్రభుత్వానికి, ఇతర పార్టీలకు షాకు ఇస్తున్నట్టుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సిని హీరోయిన్ రోజా విమర్శించారు. జగన్‌కు రాహు, కేతువుల్లా కాంగ్రెస్, టీడీపీలు అడ్డుపడుతున్నాయని ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications