కూతురుతో కలిసి భర్తను చంపిన భార్య: అత్తను కోడలు

రెండు రోజుల క్రితం చిన్న కుమార్తె అనుమానాస్పద స్థితిలో బావిలో పడి చనిపోయింది. అయితే తన రెండో కూతురు మృతికి భర్తే అని భావించిన భార్య పెద్ద కూతురుతో కలిసి ఆదివారం రాత్రి అదమరిచి నిద్రిస్తున్న తన భర్త మల్లయ్యను కత్తితో పొడిచి చంపేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఇక వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్లులో ఓ కోడలు అత్తను హత్య చేసింది. ఇందుకు భూతగదాలే కారణమని తెలుస్తోంది. ఊకల్లు గ్రామానికి చెందిన మల్లమ్మ కొడుకు పదేళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుండి కోడలు అత్తకు చెందిన పొలాన్ని కౌలుకు ఇచ్చింది. తమ పోషణ పట్టించుకోక పోవడంతో అత్తమామలు కోడలును నిలదీశారు.
దీంతో ఆగ్రహం చెందిన సదరు కోడలు అత్త గొంతుపై కాలితో నొక్కి చంపేసింది. అత్త మృతి చెందినదని గమనించిన కోడలు వెంటనే అక్కడ నుండి పరారైంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.