వైయస్ చాపర్: కో-పైలట్ ఫ్యామిలీ ఆవేదన, జగన్‌పైనా

2009 సెప్టెంబర్ 2న నల్లమల అడవుల్లో హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్‌తో పాటు మరణించిన కో పైలట్ ఎంఎస్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈ ప్రమాదం జరిగి మూడేళ్లు పూర్తవుతున్నా కుటుంబంలో ఎవరికీ ఉద్యోగం ఇవ్వలేదని, ఇతరత్రా సాయం కూడా ఏమీ చేయలేదని విమర్శించారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, పిల్లల చదువుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆనాటి మృతుల్లో సెక్యూరిటీ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జాన్‌వెస్లీ, ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణం కుటుంబాల్లో ఒక్కొక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించారని అన్నారు.
మరి తన సోదరుడి విషయంలో ఇలా చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులను కలిసినప్పుడు ఇంకా సాయం అందలేదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. హెలికాప్టర్ ప్రమాదం విషయం తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తమ ఇంటికి వచ్చి, ఆ కుటుంబాన్ని పరామర్శించి చేదోడువాదోడుగా ఉంటామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఆ విషయాన్నే మర్చిపోయారని జగదీశ్వర్ రెడ్డి విమర్శించారు.
వైయస్ మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలిన వారందరినీ ఓదార్చేందుకు ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేశారని జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక సహకారం కూడా అందించారని గుర్తు చేశారు. మరి ఎంఎస్ రెడ్డి కుటుంబాన్ని ఆయన ఎందుకు ఓదార్చలేదని ప్రశ్నించారు. ఆర్మీలో పైలట్‌గా చేరిన ఎంఎస్ రెడ్డి సమర్ధంగా బాధ్యతలు నిర్వర్తించి లెఫ్టినెంట్ కర్నల్‌గా వివిఐపిలకు విశేష సేవలు అందించారన్నారు.
సొంత రాష్ట్రానికి వచ్చి పిల్లలతో గడపాలనుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్‌కు ఆయన సేవలు అవసరమని ఇక్కడకు రప్పించినట్లు తెలిపారు. ఇప్పుడు తమ కుటుంబం వారికి అండగా ఉండటంతో పిల్లలు చదువుకుంటున్నారని, లేనిపక్షంలో వారు రోడ్డున పడేవారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇకనైనా ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications