బైరెడ్డి సీమ చిచ్చుపై వసంత నాగేశ్వర రావు ఫైర్

Vasantha Nageswar Rao
విజయవాడ: ప్రత్యేక రాయలసీమ పేరుతో తెలుగుదేశం పార్టీ నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేస్తున్న ఆందోళన సమైక్యవాదులకు బలం చేకూరుస్తుందని మాజీ హోం మంత్రి, ప్రత్యేకాంధ్ర ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఆయన కృష్ణా జిల్లా నందిగామలో మీడియాతో మాట్లాడారు. బైరెడ్డి ఆందోళనను తప్పు పట్టారు.

తెలంగాణా ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ప్రత్యేక రాయలసీమ పేరుతో బైరెడ్డి చేస్తున్న ఆందోళన సమైక్యవాదానికి అండగా నిలుస్తుందన్నారు.ఆంధ్రా పాలకుల వల్ల రాయలసీమ అభివృద్ధి కాలేదని బైరెడ్డి ఆరోపించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. రాష్టానికి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచే అయ్యారని గుర్తు చేశారు.

ఆంధ్రా ప్రజలను నయవంచకులుగా చిత్రీకరిస్తూ మాట్లాడడం బైరెడ్డి మానుకోవాలన్నారు. రాష్ట్రాన్ని కోరుకొనే హక్కు ఎవరికైనా ఉంటుందని, అందుకోసం ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతీయడం సరికాదన్నారు. ఇకపై ఏ ప్రాంత నాయకులైనా ఆంధ్రా ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడితే సహించేది లేదన్నారు.

మంచితనం, గౌరవ భావాలను ఇచ్చి పుచ్చుకొనే సంస్కృతి గల ఆంధ్ర ప్రజల సహనాన్ని పరీక్షించవద్దన్నారు. తెలంగాణా, రాయలసీమ విడిపోతేనే ఆంధ్ర ప్రజలు అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తెలంగాణాను, అవసరమైతే రాయలసీమ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+