వేధింపులతో ట్యాంకెక్కారు:ఎమ్మెల్యేలను పరుగెత్తించారు

విడాకులు కావాలంటూ ఒత్తిడి చేయడంతో విఘ్నేశ్వరి, రామతులసిలు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు తమ ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ వారు ఈ రోజు ఉదయం వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఎమ్మెల్యేలు, ఎస్పీలు వచ్చి తమకు న్యాయ చేస్తామని హామీ ఇచ్చే వరకు ట్యాంక్ దిగేది లేదని హెచ్చరించారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వని పక్షంలో ట్యాంక్ మీద నుండి దూకి చస్తామని బెదిరించారు.
ఈ విషయాన్ని పోలీసులు స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డికి తెలిపారు. అలాగే బాధితుల నియోజకవర్గం ఎమ్మెల్యే శేషా రెడ్డి కూడా స్పందించారు. తల్లీ కూతుళ్ల హెచ్చరికలతో ఇరువురు ఎమ్మెల్యేలు ట్యాంక్ వద్దకు చేరుకొని తల్లీ కూతుళ్లతో చర్చించారు. వారికి న్యాయం చేస్తామని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల హామీ నేపథ్యంలో తల్లీ కూతుళ్లు ట్యాంక్ దిగారు.












Click it and Unblock the Notifications