వసతులు లేవని చర్లపల్లి జైలులో భాను కిరణ్ హల్‌చల్

సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను పోలీసులు ఏప్రిల్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో మే 4వ తేది వరకు భాను కిరణ్‌కు కోర్టు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించింది. దీంతో భానును పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. పొద్దునే ఆరుగంటలకే తనకు అన్ని పత్రికలు కావాలని జైలు సిబ్బందితో అతను వాదానికి దిగాయని అప్పుడు వార్తలు వచ్చాయి. దీంతో జైలు సిబ్బంది కొన్ని పత్రికలను సమకూర్చారు. భానును చూసేందుకు ఇతర బ్యారెక్స్‌లో ఉండే నేరగాళ్లు ఎగబడ్డారు.
సూరి చాలాకాలం చర్లపల్లి జైల్లో ఉన్న విషయం విదితమే. సూరితో కలిసి ఉన్న ఖైదీలు ఇప్పుడు భాను చుట్టూ చేరి ఆసక్తిగా మాట్లాడుకోవడం కనిపించిందని జైలు వర్గాలు అప్పుడు తెలిపాయి. ప్రస్తుతం చర్లపల్లి మానస విభాగంలో ఉన్న భానును ముందు చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లాలని పోలీసులు గతంలో భావించారు. కానీ ఇటీవలి కాలంలో చంచల్‌గూడ జైలులో విఐపి విచారణ ఖైదీల సంఖ్య పెరిగింది. పైగా రెండు ప్రధాన అంశాలను దృష్టిలో పెట్టుకుని చంచల్‌గూడ జైలుకు భానును తరలించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications