హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రాజెక్టుపై కిరణ్‌కు బాబులేఖ:కరెంట్‌పై విజయమ్మ ధర్నా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu - YS Vijayamma
హైదరాబాద్/కడప: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని కిరణ్‌ను బాబు తన లేఖలో కోరారు. ఈ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లను స్పీకర్ ముందుంచాలని డిమాండ్ చేశారు. పోలవరం పూర్తయితే జలయజ్ఞం సఫలమవుతుందన్నారు.

స్పీకర్ ముందు ఫైళ్లు ఉంచాలని తాము గతంలోనే కోర్టుకు లేఖ రాసినట్లు చెప్పారు. జాతీయ హోద సాధించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని ఎద్దేవా చేశారు. కాగా విద్యుత్ సమస్యల పైన లెఫ్ట్ నేతలు చంద్రబాబును కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. విద్యుత్ సమస్యలపై ఉమ్మడిగా ఉద్యమిద్దామని తాము బాబుకు సూచించామని, పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారని తెలిపారు. శుక్రవారం రోజు వైయస్సార్ కాంగ్రెసు ఇచ్చిన బందు పిలుపును వాయిదా వేసుకోవాలని, సెప్టెంబర్ 1న అన్ని పార్టీలు కలిసి బందును పాటిస్తామని ఆ పార్టీ నేతలకు లెఫ్ట్ నేతలు సూచించారు.

అందరం కలిసి విద్యుత్ సమస్యపై ఉద్యమిద్దామని సూచించారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక లేక పోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందన్నారు. తమ నిర్ణయానికి అన్ని పార్టీలు సానుకూలంగా స్పందిస్తున్నాయని లెఫ్ట్ నేతలు చెప్పారు.

కాగా కరెంటు కోతలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బుధవారం పులివెందుల నియోజకవర్గంలో ధర్నా చేపట్టింది. నియోజకవర్గంలని సింహాద్రిపురం, వేంపల్లి, పులివెందుల మండలాలలోని సబ్ స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగింది. వేంపల్లె వద్ద చేపట్టిన ధర్నాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

రైతులకు ఏడు గంటల కరెంటు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా అయిదు గంటలు కూడా ఇచ్చిన పాపాన పోలేదన్నారు. దాదాపు రెండు, మూడు నెలలుగా కోతలు పెడుతూ వినియోగదారులతో విద్యుత్ అధికారులు చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పంచాయతీల్లో కనీసం వీధిలైట్లు వెలిగే పరిస్థితి కూడా లేదన్నారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu written a letter to CM Kiran Kumar Reddy about Polavaram and Pranahitha - Chevella projects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X