కేరళలో 'బాబు' హెరిటేజ్ పాలపై నిషేధం, మరో రెండూ

తమిళనాడు నుంచి కేరళకు సరఫరా అవుతున్న హెరిటేజ్ పాలలో కల్తీ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. క్యాన్సర్ కారక రసాయన సంరక్షకం ఫార్మాలిన్ లేదా ఫార్మాల్ డీ హైడ్ ఈ పాలలో ఉన్నట్లు కేరళ ప్రభుత్వ లాబ్‌లో నిర్వహించిన పరీక్షలలో నిర్ధారణ అయింది. తమిళనాడులోని దిండిగుల్ జిల్లాలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్(ఇండియా) లిమిటెట్ నుంచి హెరిటేజ్-పద్మనాభ బ్రాండ్ పేరుతో సరఫరా అవుతున్న పాశ్చరైజ్డ్, హోమోజినైజ్డ్, స్టాండర్డైజ్డ్ పాలలో ఈ రసాయనాన్ని గుర్తించారు.
హెరిటేజ్ పాలతో పాటు తిరునల్వెలి, వడక్కానుకుళంలోని సోఫియా రాజా మిల్క్ అందించే జేష్మా మిల్క్, కన్యాకుమారిలోని అరుల్వాయ్‌మొజిలో ఉన్న మైమా మిల్క్ ప్లాంట్ అందించే మైమా పాల బ్రాండులలోనూ ఫార్మాలిన్‌ను కనుగొన్నారు. దీంతో ఈ మూడింటిని నిషేధించారు. అలాగే కల్తీ జరుగుతున్న ప్లాంట్లలో తనిఖీలు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు లేఖ రాశారు. కాగా హెరిటేజ్ కంపెనీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిది.












Click it and Unblock the Notifications