తెలంగాణపై తేల్చేదేమీ లేదు, ఆ తర్వాతే: ఆజాద్

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: తెలంగాణపై ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని, తెలంగాణపై ఇప్పటికిప్పుడు తేల్చేదేమీ లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో భేటీ తర్వాత ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడం లేదని, దానిపైనే తామంతా దృష్టి పెట్టామని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాతనే తెలంగాణపై ఆలోచిస్తామని ఆయన అన్నారు.

ధర్మాన ప్రసాద రావు రాజీనామాను ఆమోదించలేదని, రాజీనామా పెండింగులోనే ఉందని, పెండింగులోనే ఉంటుందని ఆయన చెప్పారు. వివరణ ఇవ్వడానికి సిబిఐ ధర్మాన ప్రసాద రావుకు నాలుగు నెలల సమయం ఇచ్చిందని, ఆ తర్వాతనే ధర్మాన ప్రసాద రావు రాజీనామాపై నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు.

నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలపై కూడా ఆయన ప్రతిస్పందించారు. నాయకత్వ మార్పు ఉంటుందని మీకు ఎవరు చెప్పారంటూ ఆయన మీడియా ప్రతినిధులకు ఎదురు ప్రశ్న వేశారు. నాయకత్వ మార్పు ఏదీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని గానీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను గానీ మార్చడం లేదని ఆయన చెప్పారు. సెప్టెంబర్ 17వ తేదీలోగా తెలంగాణపై తేల్చాలని పార్టీ తెలంగాణ నాయకులు అడుగుతున్నారని, తెలంగాణపై త్వరగా తేల్చాలని సీమాంధ్ర నాయకులు కోరుతున్నారని మీడియా ప్రతినిధులు గుర్తు చేయగా, పార్లమెంటు సమావేశాల తర్వాతనే తెలంగాణపై ఆలోచన ఉంటుందని ఆయన చెప్పారు.

ఆజాద్‌తో రాజకీయాలు చర్చించలేదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై తాను ఆజాద్‌కు వివరించినట్లు ఆయన తెలిపారు. వర్కుషాపులు నిర్వహించి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించామని తాను చెప్పినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీకి వచ్చిన దామోదర రాజనర్సింహ బుధవారం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కలిశారు. రేపు శుక్రవారం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై, తెలంగాణపై అధిష్టానం పెద్దలతో దామోదర రాజనర్సింహ చర్చిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+