భర్త ఇంటి ముందు భార్య బైఠాయింపు, ఉడాయింపు

అప్పట్లో లాంఛనాల కింద 30 తులాల బంగారం, మూడు లక్షల నగదు ఇచ్చారు. వివాహమైన ఏడాదిలోనే అత్తింటి వేధింపులు ప్రారంభమయ్యాయి. కూతురు కాపురం చక్కదిద్దడం కోసం ఝాన్సీ తల్లిదండ్రులు భూమి అమ్మి మరో మూడు లక్షలు ఇచ్చారు. ఝాన్సీ 2011లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటినుంచి అత్తింటివారు ఝాన్సీని తీసుకుళ్లకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ప్రశ్నించారు.
మరో పది లక్షలు ఇస్తేనే కాపురానికి తీసుకువెళతామనడంతో అంత మొత్తం ఇవ్వలేమని ఝాన్సీ కన్నవారు చెప్పారు. దీంతో పుట్టిన పిల్లకు, తమకు సంబంధం లేదని భర్త, అత్తమామలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఝాన్సీ బుధవారం అత్తింటి ఎదుట బైఠాయించింది. తాను వస్తున్న విషయం తెలిసి భర్త, మామ పరారయ్యారని ఆమె తెలియజేసింది.
అత్త రాజేశ్వరిని ఝాన్సీ కుటుంబ సభ్యులు, బంధువులు ప్రశ్నించగా తన భర్త, కుమారుడి అనుమతి లేకుండా ఆమెను ఇంట్లోకి తీసుకువెళ్లలేనని చెప్పింది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఝాన్సీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జోగారావు తెలిపారు.












Click it and Unblock the Notifications