గాంధీ కుటుంబంపై అదే భావన, కోపం లేదు: అమితాబ్

గాంధీ కుటుంబం పట్ల నేటికీ అదే మైత్రి బంధం... భావన ఉన్నాయని తెలిపారు. ఆ కుటుంబాన్ని తాను సర్వదా గౌరవిస్తానని, అప్పుడప్పుడు ఏదైనా కార్యక్రమాలలో తారసపడుతుంటామని, అప్పుడు చాలా మామూలుగానే ఉంటామని చెప్పారు. కాగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అమితాబ్ స్నేహితుడన్న విషయం తెలిసిందే. రాజీవ్ ప్రోత్సాహంతో.. 1984లో అమితాబ్ అలహాబాద్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి గెలిచారు.
అయితే... అప్పట్లో బోఫోర్స్ కుంభకోణంలో అమితాబ్ కుటుంబానికి కూడా పాత్ర ఉందని ఆరోపణలు రావడంతో.. ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి గాంధీ కుటుంబంతో.. అమితాబ్‌గానీ, ఆయన కుటుంబసభ్యులు గానీ అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. తాజాగా ఈ అంశంపై ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అమితాబ్ పై విధంగా స్పందించారు.












Click it and Unblock the Notifications