5 కోట్లకు అంగీకరించా, మనస్శాక్షికి భయపడ్డా: పట్టాభి

ఒకవైపు రూ. పది కోట్లు, మరోవైపు రూ. ఐదు కోట్లు అని కానీ ముప్పు తక్కువుంటుందన్న ఉద్దేశంతో చివరకు ఐదు కోట్లు తీసుకుని బెయిల్ ఇచ్చానని ఆయన అన్నారు. ఏసీబీ నమోదు చేసిన ఈ నేరాంగీకార పత్రం 'ఆంధ్రజ్యోతి'కి చిక్కింది.
నేరాంగీకార పత్రంలోని వివరాలు ఇలా ఉన్నాయి - 'నా బ్యాచ్‌మేట్, చిన్ననాటి మిత్రుడు పీవీ చలపతిరావు నా వద్దకు వచ్చి గాలి బెయిల్ విషయమై మాట్లాడాడు. వాళ్లు 5 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పాడు. తొలుత సందేహించా. అయితే పేరు బయటకు రాదని, అంతా తాను చూసుకుంటానని చలపతిరావు హామీ ఇచ్చాడు. అప్పటికే మరో ఆఫర్ కూడా వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న న్యాయాధికారి డి.ప్రభాకర్ రావు రూ.10 కోట్లు ఇస్తానన్నారు. కానీ తిరస్కరించాను' అని చెప్పారు.
'మే 5 నుంచి చలపతి రావు, నేను తరచుగా ఫొన్‌లో మాట్లాడుకున్నాం. 5 కోట్లకు డీల్ కుదిర్చిన చలపతి రావు.. గాలి బంధువుల నుంచి డబ్బులు తీసుకుని వాటిని నా కుమారుడి పేరుతో బ్యాంకు లాకర్‌లో ఉంచుతానని చెప్పాడు. ఒప్పందం ప్రకారం మే 11 న నేను గాలికి బెయిల్ మంజూరు చేశా' అని చెప్పారు.
'మరునాడు చలపతి రావు ఫోన్ చేసి డబ్బు ఉంచిన కార్పొరేషన్ బ్యాంకు లాకర్ల తాళాలను తీసుకోడానికి రవిచంద్రను పంపమని చెప్పాడు. లాకర్లలో 2 కోట్లు ఉన్నాయని ఒప్పందం ప్రకారం సీబీఐ వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన తర్వాత మిగతాది ఇవ్వనున్నట్టు చెప్పాడని' పట్టాభి రామారావు చెప్పారు.












Click it and Unblock the Notifications