వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకేం తక్కువ, ఏ పదవైనా...: ఆన వివేకానంద రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

Anam Vivekanda Reddy
హైదరాబాద్: అధిష్ఠానం ఆదేశిస్తే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీయేకాదు, ఏ పదవినైనా చేపట్టే సామర్థ్యం తమకు ఉందని శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి అన్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో శుక్రవారం నాడు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఆయన సోదరుడు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి దక్కే అవకాశాలున్నాయన్న ప్రచారం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయనపై విధంగా స్పందించారు. అంతలో కొందరు సీఎం పదవినైనా చేపడతారా అని ప్రశ్నిస్తే పరిస్థితి చేజారిపోతుందని గ్రహించిన ఆయన - అమాయకుడినైన తననెందుకు సతాయిస్తారంటూ అమాయకంగా ముఖం పెట్టారు.

తర్వాత అధిష్ఠానం తమను ఇప్పుడు గౌరవంగా చూడడం లేదా అని ప్రశ్నించారు. తన సోదరుడికి లక్షా 40 వేల కోట్ల బడ్జెట్ ఉండే అర్థిక శాఖకు మంత్రిని చేశారని, అంతకంటే గౌరవం ఏం కావాలని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పదవుల గురించి మాట్లాడాలని, పీసీసీ, సీఎం పోస్టులు ఖాళీగా లేవన్నారు.

పీసీసీ అధ్యక్షునిగా సమర్ధుడైన బొత్స సత్యనారాయణ ఉంటే, ముఖ్యమంత్రి పదవిలో నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి తమకున్నాడని గర్వంగా చెప్పుకునే నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ఉన్నారని అన్నారు. ఇలాంటి సమయంలో లేని పదవుల కోసం ఎందుకు ప్రశ్నిస్తారంటూ నిష్క్రమించారు.

English summary
Congress MLA Anam Vivekanda Reddy said that they will take any responsibility, if party high command gives. He said that the posts of CM and PCC president are not vacant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X