డబ్బు కోసం: భార్యపై ఓ శాడిస్ట్ భర్త ఘాతుకం

మరోవైపు అత్త అనురాధ అదనంగా మరో రూ. 3 లక్షలు కట్నంగా తీసుకురమ్మని వేధిస్తుండేది. అన్ని బాధలను దిగమింగుతూ మౌనంగా భరిస్తున్న అనూషపై ఉదయ్ ఆగడాలు అడ్డులేకుండా పోయాయి. చివరికి తనకు డబ్బు సమకూర్చేందుకు వ్యభిచారంలోకి దింపే ప్రయత్నం చేసేసరికి అనూషను తట్టుకోలేకపోయింది. భర్తకు అత్త కూడా వంతపాడటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఉదయ్ ఆగడాలు శృతిమించాయి.
బ్లేడ్లతో కోయడం, సిగరెట్లుతో కాల్చడం వంటి పైశాచిక చర్యల ఉదయ్ పాల్పడేవాడని అనూష విలేకరుల ముందు కన్నీరు మున్నీరైంది. చిత్ర హింసలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోవడంతో అనూష మీడియాను ఆశ్రయించింది. దీంతో భర్త బాగోతం వెలుగులోకి వచ్చింది.
మరోవైపు జిల్లాలోని గుడాడుపల్లికి చెందిన రవి, ప్రమీల దంపతులు కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. తనయుడు శ్రీకాంత్ పెరుగుతున్నా మానసికంగా ఎదుగుదల చెందలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రమీల గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొడుకు శ్రీకాంత్‌కు ఉరి వేసి చంపింది. ఆ తర్వాత తాు కూడా ఆత్మహత్య చేసుకుంది.












Click it and Unblock the Notifications