షాద్‌నగర్ వద్ద 'అనంత' కక్షలు: గొంతు కోసి ఇద్దరి హత్య

Murder near Shadnagar
మహబూబ్‌నగర్: రాయలసీమ ముఠాకక్షలు మహబూబ్‌నగర్ జిల్లాలో తమ విశ్వరూపం ప్రదర్సించాయి. అనంతపురం జిల్లాలోని పాత కక్షలు మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ శివార్లలో ఇద్దరిని బలి తీసుకున్నాయి. ఇద్దరు వ్యక్తులను ప్రత్యర్థులు వేటకొడవళ్లతో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

మృతులను అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఒకరిని కృష్ణాపురంవాసి మల్లికార్జున్‌గా, మరొకతన్ని తాడిపత్రికి చెందిన లింగుట్ల ప్రసాద్‌గా గుర్తించారు. పాత కక్షలే ఇందుకు కారణమని భావిస్తున్నారు. నిరుడు నవంబర్ 12వ తేదీన జరిగిన వెంకట్రామారెడ్డి హత్యకు ప్రతీకారంగానే ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తోంది.

షాద్‌నగర్‌ శివారులోని ఓ డాబా వద్ద మరో ఇద్దరితో కలిసి టీ తాగుతుండగా వాహనాలపై వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఇద్దరిపై దాడి చేశారు. పారిపోతున్న మల్లికార్జున్‌ను వెంబడించి ప్రత్యర్థులు హత్య చేశారు. వెంకట్రామా రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్యలో ఆరుగురు వ్యక్తులు నిందితులు.

ఆరుగురు నిందితుల్లో హత్యకు గురైన వీరిద్దరు ఉన్నారు. దీంతో వెంకట్రామారెడ్డి హత్యకు ప్రతీకారంగానే ఈ హత్యలు జరిగి ఉంటాయని భావిస్తున్నారు. వెంకట్రామా రెడ్డి బంధువులు లేదా కుటుంబ సభ్యులు ఈ జంట హత్యలకు పాల్పడి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కసారిగా కలకలం చెలరేగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+