హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెస్క్యూ హోమ్‌పై దాడి, నలుగురు అమ్మాయిల కిడ్నాప్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rescue home attacked and 4 girls kidnapped
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని రామంతపూర్‌లో గల రెస్క్యూ హోమ్‌పై దాదాపు 15 మంది దుండగులు గత రాత్రి దాడి చేసి నలుగురు అమ్మాయిలను ఎత్తుకెళ్లారు. దీంతో రెచ్చిపోయిన మహిళా సంఘాల కార్యకర్తలు, నేతలు శనివారం ఉదయం రెస్క్యూ హోం నిర్వాహకుడు సత్యనారాయణ రెడ్డిపై దాడి చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మహిళల నుంచి సత్యనారాయణ రెడ్డిని రక్షించి అదుపులోకి తీసుకున్నారు. సెక్స్ రాకెట్ ముఠానే అమ్మాయిలను ఎత్తుకెళ్లి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రామంతపూర్‌లోని ఉజ్వల రెస్క్యూ హోమ్‌పై ఆ దాడి జరిగింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఓ అమ్మాయిని, కోల్‌కత్తాకు చెందన ఇద్దరు అమ్మాయిలను, ముంబైకి చెందిన ఓ అమ్మాయిని దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే, అమ్మాయిల బంధువులే దాడి చేసి వారిని తీసుకుని వెళ్లి ఉంటారని మొదట అనుమానాలు వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు రంగంలోకి దిగడంతో సంఘటన మలుపు తిరిగింది.

దాదాపు అరగంట పాటు దుండగులు రెస్క్యూ హోమ్‌లో బీభత్సం సృష్టించారు. దీంతో అందులోని అమ్మాయిలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అపహరణకు గురైన నలుగురు అమ్మాయిలను నెలన్నర క్రితం రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. సెక్స్ రాకెట్ బ్రోకర్లే దాడికి దిగారని మహిళా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రెస్క్యూ హోమ్ నిర్వాహకుడు కూడా వ్యభిచారం నిర్వహిస్తున్నాడని వారు ఆరోపించారు.

రెస్క్యూ హోమ్‌లో 15 మంది యువతులు ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు ఏ విధమైన సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని సత్యనారాయణ రెడ్డి చెబుతున్నాడు. అతన్ని మహిళలు కొట్టారు కూడా. సంఘటనపై మంత్రి సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. సంఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.

English summary
A rescue home at Ramanthapur in Hyderabad was attacked by unidentified persons last night and kidnapped four girls. Women organizations activists attacked the manager of the Ujjwala rescue home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X