హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెర్రర్ లింక్స్: హైదరాబాదీ సహా ఐదుగురి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Terror probe widens, five more suspects arrested
ముంబై: లష్కరే తోయిబా, కర్ణాటకలోని హుజీతో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న 11 మంది అరెస్టు భద్రాత సిబ్బందికి మరిన్ని విషయాలను తెలియజేస్తోంది. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానంతో 11 మందిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి బెంగళూర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు రచించిన పథకంతో సంబంధాలున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం నాందేడ్ జిల్లాలో నలుగురిని, హైదరాబాద్‌లో ఒకర్ని అరెస్టు చేసింది. హైదరాబాద్ విద్యార్థిని కర్ణాటక పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగళూర్‌లో ఉగ్రవాదులుగా అనుమానిస్తూ అరెస్టు చేసిన 11 మందితో సంబంధం ఉన్న నలుగురిని తాము అరెస్టు చేసినట్లు ఎటిఎస్ చీఫ్ రాకేష్ మారియా చెప్పారు. అంతకు మించి వివరాలను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

హైదరాబాదులో ఒబైద్ రెహ్మాన్ (26) అనే విద్యార్థిని అరెస్టు చేశారు. బెంగుళూర్‌లో అరెస్టు చేసిన 11 మంది నుంచి మహారాష్ట్ర ఎటిఎస్ కొంత సమాచారం తీసుకుంది. వారి నుంచి తీసుకున్న సమాచారం మేరకు నాందేడ్‌లో నలుగురిని అరెస్టు చేశారు.

రెండు రోజుల క్రితం బెంగళూర్ పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో డిఆర్‌డివో శాస్త్రవేత్త, జర్నలిస్టు కూడా ఉన్నారు. వారికి లష్కరే తోయిబాతోనూ హుజీతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు. కర్ణాటకలోని పార్లమెంటు సభ్యులను, శానససభ్యులను, మీడియా వ్యక్తులను లక్ష్యం చేసుకుని దాడులు చేయాలని వారు రచించిన పథకాన్ని పోలీసులు ఛేదించారు.

వారి నుంచి పోలీసులు విదేశీ తయారీ 7.64ఎంఎం పిస్టల్‌ను, ఏడు రౌండ్ల మందుగుండు సామగ్రిని, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
The arrest of 11 terror suspects having links with the Lashkar-e-Toiba and HuJI in Karnataka earlier this week appears to have provided vital leads to security agencies. Five more terror suspects are reported to have been picked up on Saturday, in connection with the Bangalore terror module.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X