గడ్డం పెంచుకుని తిరిగే...: బాబుపై నారాయణ వ్యాఖ్య

కాంగ్రెసు నాయకులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి మంత్రులపై డబ్బులు వెచ్చిస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇవ్వడానికి వెనకాడుతోందని ఆయన అన్నారు. కాంగ్రెసు నాయకులు కళ్లున్న కబోదులని ఆయన వ్యాఖ్యానించారు. సోనియా గాంధీని చూసి కుర్చీల కింద దాక్కునే కాంగ్రెసు నాయకులు తనను క్షమాపణలు చెప్పమంటారా అని ఆయన మండిపడ్డారు. తమకు సంపదతో కూడిన తెలంగాణ కావాలని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీని బంగాళాఖాతంలో కలిపితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు. తెలంగాణపై వాయిదాలు పెడుతున్న కాంగ్రెసు పార్టీని బోగి మంటల్లో కాల్చాలని ఆయన అన్నారు. జనాన్ని దోచుకునేవారు ఏ ప్రాంతంవారైనా తరిమికొట్టండని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెసు తెలంగాణను ఖూనీ చేయడం వల్ల 800 మంది మరణించారని, హత్యానేరం కింద కేసులు పెట్టిన కాంగ్రెసు నాయకులను జైల్లో పెట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. శవాలపై ప్రమాణం చేసి మాట తప్పిన కాంగ్రెసు నాయకులు స్మశానంలో బొగ్గులు అమ్ముకునేవారి కన్నా హీనమని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రజాభీష్టం మేరకు రాజ్యాంగాన్ని సవరించి అయినా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. జాతీయ స్థాయిలో తమ పార్టీ తెలంగాణకు మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను సీమాంధ్ర నాయకులు అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ ఇచ్చి తీరాల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణను చిరకాలం అడ్డుకోవాలని చూస్తే ఇంకా సమస్యలు పెరుగుతాయని ఆయన అన్నారు. శాసనసభలో తీర్మానం చేయలేదనే పేరుతో తెలంగాణను అడ్డుకోవడం అర్థరహితమని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ ఉందా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications