అమెరికాలో తెలుగు టెక్కీ మృతి, ఈతకు వెళ్లి....

USA
హైదరాబాద్: అమెరికాలోని న్యూయార్క్‌లో తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పడపాటి రాజాచౌదరి మృతి చెందారు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన రాజా చౌదరి(25) న్యూయార్క్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో గత కొన్ని రోజులుగా పనిచేస్తున్నారు. ఆదివారం సహచర మిత్రులతో కలిసి ఈతకు వెళ్లిన రాజా ప్రమాదవశాత్తు ఈత కొలనులో పడి మృత్యువాతపడ్డారు. రాజా మరణవార్తతో అద్దంకిలోని కుటుంబ సభ్యులు కన్నీటి సముద్రంలో మునిగిపోయారు.

ఇదిలా వుంటే, ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికా నుంచి వచ్చి హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నాడు. అమెరికాలోని సాన్ డీగో నుంచి అతను ఆదివారం హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన 30 ఏళ్ల టెక్కీ క్యాబ్‌ను అద్దెకు తీసుకుని అందులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. కూకట్‌పల్లిలోని బావమరిది ఇంటికి చేరుకున్న తర్వాత అతను కారులోనే మరణించి ఉండటాన్ని డ్రైవర్ గమనించాడు.
వివాహ సంబంధమైన సమస్యలే అతని ఆత్మహత్యకు కారణమని అనుమానిస్తున్నారు. మృతుడిని ఇమ్మడి అనిల్ కుమార్‌గా గుర్తించారు. ఏడాది క్రితం అనిల్ నల్లగొండ జిల్లా కోదాడకు చెందిన స్వప్నను వివాహం చేసుకున్నాడు. వివాహమైన తర్వాత దంపతులు ఇద్దరు కూడా అమెరికాకు వెళ్లారు. స్పప్న పది రోజుల క్రితం ఇక్కడికి వచ్చి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయిందని పోలీసులు చెబుతున్నారు.

శనివారం అనిల్ సాన్ డీగో నుంచి శనివారం హైదరాబాద్ వచ్చి కూకట్‌పల్లిలోని సితారా హోటల్లో దిగాడు. ఆదివారం సాయంత్రం మెరూ క్యాబ్‌ను బుక్ చేసుకుని కూకట్‌పల్లిలోని ఈనాడు కాలనీలో గల తన బావ మరిది సురేష్ ఇంటికి బయలుదేరాడు. సాయంత్రం నాలుగున్నరకు ఇంటికి చేరుకున్నాడు. అయితే క్యాబ్ నుంచి దిగలేదు.

అతను ఎవరికోసమైన వేచి చూస్తున్నాడేమోనని భావించి తాను కదిలించలేదని, కొద్దిసేపటికి అతను స్పృహ లేదని గుర్తించి కుటుంబ సభ్యులను పిలిచానని క్యాబ్ డ్రైవర్ జితేందర్ చెప్పాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతను అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చేశారు.

అనిల్ కుమార్ జేబులో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది. వివాహ సంబంధమైన సమస్యల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రాసి ఉంది. భారత గడ్డపై మరణించడానికే తాను ఇక్కడికి వచ్చినట్లు అతను అందులో రాశాడు. తన కలలను సాకారం చేసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. హోటల్లో గానీ, క్యాబ్‌లో కూర్చున్న తర్వాత గానీ అనిల్ విషం తీసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+