వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరు తెస్తే బాధ్యత మాదే: తెలంగాణపై కాంగ్రెస్‌కు కిషన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
న్యూఢిల్లీ: పార్లమెంటులో మీరు తెలంగాణ బిల్లు పెడితే ఆ తర్వాత మద్దతిచ్చి దానిని ఆమోదింప చేసే బాధ్యత తమ పార్టీదేనని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబరుపేట శాసనసభ్యుడి కిషన్ రెడ్డి సోమవారం అన్నారు. ఆయన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కోసం ఆయన సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెసుకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలన్నారు.

తెలంగాణపై ఇచ్చిన మాట తప్పినందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై బిజెపి కట్టుబడి ఉందని, కాంగ్రెసు మాత్రం మాట తప్పిందన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడితే తమ పార్టీ భేషరతుగా మద్దతిస్తుందని కాంగ్రెసుకు సూచించారు. టిడిపి, సిపిఎం, ఎంఐఎం మద్దతు ఇవ్వక పోయినప్పటికీ బిల్లును పాస్ చేయించే బాధ్యత తమదే అన్నారు.

తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని కాంగ్రెసుకు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్ట్రం ఎవరికీ వ్యతిరేకం కాదని, తెలంగాణను ఏ ప్రాంత ప్రజలు కూడా వ్యతిరేకించడం లేదన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నేతలకు, జిల్లాలకు తెలంగాణ వ్యతిరేకం కాదన్నారు. నాడు ఏ హైదరాబాదు రాజధానిగా ఉండేదో అదే నగరం రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. హిందీ మాట్లాడే వారికి ఇన్ని రాష్ట్రాలు ఉండగా తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు.

అన్నదమ్ముల్లా విడిపోయి రెండు ప్రాంతాలను సమాంతరంగా, వేగంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. బిల్లు పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలన్నారు. ప్రజలే దేవుళ్లు అని, వారే అంతిమ నిర్ణేతలు అన్నారు. అప్పట్లో పార్లమెంటు ముందు ధర్నా చేసిన నేతల పైన కాంగ్రెసు ఎదురు దాడి చేసిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని కాంగ్రెసుకు హితవు పలికారు. బిజెపిది ఒకటే మాట అని.. ఇతర పార్టీల్లా రెండు కళ్ల సిద్ధాంతాలు, రెండు మాటలు లేవన్నారు.

English summary
BJP state president Kishan Reddy said on Monday that BJP will support Telangana bill if Congress would introduce in Parliament. Party senior leader Rajnath Singh launches Kishan Reddy's Satyagraha at Jantha Manthar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X