వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో టెర్రరిస్ట్ అరెస్టు: కిషన్ రెడ్డి టార్గెట్‌లో లేరన్న సిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Karnataka Terror Plot
బెంగళూరు/హైదరాబాద్: కర్నాటక పోలీసులు సోమవారం మరో అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు. దావనగిరికి చెందిన నయీం సిద్దిక్ అనే వైద్య విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. కర్నాటక పోలీసులు ఇప్పటి వరకు పదిహేడు మంది ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారందరికీ ఈ సిద్దిక్ ఆర్థిక సహాయం అందించినట్లుగా పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన వారి నుండి పోలీసులు వివరాలు సేకరించి ముఖ్యపాత్రదారు అయిన సిద్దిక్‌ని పట్టుకున్నారు.

మూడు నెలలుగా సిద్దిక్ పంపించిన ఈ మెయిల్స్, కాల్ వివరాలను పోలీసులు పరిశీలించారు. ఇతనికి సౌదీ అరేబియా ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించాలని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఒక టీంను ఏర్పాటు చేసుకొని నెట్ వర్క్‌గా పని చేసేందుకు సిద్దిక్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. మెడికల్ విద్యను అభ్యసిస్తున్న సిద్దిక్ తీవ్రవాద భావజాలం వైపుకు మరలడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా సిద్దిక్ నుండి పోలీసులు పదివేల రూపాయలు, లాప్ టాప్, సెల్ ఫోన్, ఉగ్రవాద సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు ఉగ్రవాదుల అరెస్టు తర్వాత వారి టార్గెట్‌లో ఉన్న వారికి భద్రత పెంచామని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ అన్నారు. హుజీ టార్గెట్‌లో ఉన్న వారి భద్రతపై తాము సమాలోచనలు జరుపుతున్నామని, వారికి భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, అంబరుపేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి హుజి టార్గెట్‌లో లేరని చెప్పారు. హైదరాబాదులో ఇద్దరు కార్పోరేటర్లు హుజీ టార్గెట్‌లో ఉన్నారని, వారికి భద్రత పెంచామని చెప్పారు.

బయోడైవర్సిటీ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, గణేష్ నిమజ్జనం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. కేసు పురోగతిపై బెంగళూరుకు పోలీసులను పంపించామని చెప్పారు.

English summary
Another terror suspect has been arrested in Bangalore today. Dr Nayeem Siddiqui is a medical student from Davenegere in North Karnataka. The police say they have seized Rs. 10,000 in cash and a few CDs. The police also claim Dr Siddiqui was acting as a recruiter for banned terror outfits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X