16 ముక్కలుగా టాటూ ఆర్టిస్టు బాడీ, చేతిపై పుట్టుమచ్చ

రైలు కింద పడి మరణించి ఉంటాడని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అతని తల్లిదండ్రులు మాత్రం దాన్ని హత్యగానే భావిస్తున్నారు. అతని భార్య కుటుంబ సభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు. పెళ్లి వారికి ఇష్టం లేదని, దీనిపై తన కుమారుడిని వారు బెదిరించారని వారు చెబుతున్నారు
భాసిన్ కుటుంబ సభ్యులు పశ్చిమ ఢిల్లీలోని మీనాక్షి గార్డెన్‌లో నివాసం ఉంటున్నారు. అతని దేహ శకలాలు అర కిలోమీటరు వరకు చెల్లచెదురుగా పడి ఉన్నాయని వారంటున్నారు. తల ఇప్పటి వరకు లభించలేదు. భాసిన్ మరణంపై రైల్వే పోలీసులు కచ్చితమైన నిర్ణయానికి ఇప్పటి దాకా రాలేదు. రైలు గుద్ది ఉంటుందని తాము అనుమానిస్తున్నామని, అయితే శవపరీక్ష నివేదిక వస్తే ఏమైన తెలుస్తుందని, తాము అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వారు చెబుతున్నారు.
బాసిన్ ఆర్య సమాజ్ ఆలయంలో మే 9వ తేదీన పెళ్లి చేసుకుంటున్నాడని, అయితే అతని భార్య తల్లిదండ్రుల వద్దనే ఉంటోందని, వారికి ఈ పెళ్లి ఇష్టం లేదని భాసిన్ కుటుంబ సభ్యులు అంటున్నారు. తమ కుటుంబ సభ్యుల హెచ్చరిక గురించి భాసిన్‌కు అతని భార్య శనివారం ఒంటి గంట సమయంలో మెసేజ్ పంపిందని, తన తల్లిదండ్రులు అవమానించిన తీరుకు క్షమాపణ చెప్పిందని, తనను మరిచిపోవాలని కూడా అడిగిందని, ఆ తర్వాత మూడు గంటలకు అతని మరణించాడని చెబుతున్నారు.
భాసిన్ మధ్యాహ్నం మూడున్నర గంటలకు న్యాయవాది కలుసుకోవడానికి ఇంటి నుంచి వెళ్లాడని, తన భార్యను తెచ్చుకునేందుకు న్యాయపరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు వెళ్లాడని అంటున్నారు. అతను నాలుగు గంటలకు మరణించాడని, గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అతని మరణవార్తను తమకు చెప్పాడని భాసిన్ కుటుంబ సభ్యులు అంటున్నారు. భార్య భాసిన్‌ను రహస్యంగా కలుస్తుండేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications