వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై నాన్చొద్దు: వాయలార్ రవితో కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
న్యూఢిల్లీ/ హైరాబాద్: తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేయవద్దని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫసెర్ కోదండరామ్ కేంద్ర మంత్రి వాయలార్ రవిని కోరారు. రాష్ట్ర విభజన జరగాలని ఆయన అన్నారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్షకు హాజరైన ఆయన కేంద్ర మంత్రి వాయలార్ రవినిమంగళవారం కలుసుకున్నారు.

ప్రత్యేక తెలంగాణ అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన రవి అధిష్టానంతో మాట్లాడి త్వరగా తేల్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాయలార్ రవిని కలిసిన వారిలో కోదండరాంతోపాటు పలువురు తెలంగాణ నేతలు ఉన్నారు.

తెలంగాణపై నిర్ణయాన్ని నాన్చితే ఈ నెల 30వ తేదీన భారీ యెత్తున ఉద్యమం నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ జెఎసి నాయకులు హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని వారన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సిన ఆవసరాన్ని గుర్తించామని వాయలార్ రవి వారికి చెప్పారు.

రేపు బుధవారం కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్‌లను కలిసే ప్రయత్నాలు చేస్తామని వారు చెప్పారు. తెలంగాణ అంశాన్ని పరిష్కరించాలని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరుతామని కూడా చెప్పారు. బిజెపి నేతలపై జరిగిన లాఠీచార్జీని వారు ఖండించారు. అవసరమైతే మరోసారి సకల జనుల సమ్మెకు దిగుతామని వారు చెప్పారు.

ఇదిలావుంటే, తాము చేపట్టిన తెలంగాణ పోరు యాత్రకు మంచి స్పందన లభించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. మరిన్ని ఆందోళనలు చేపడతామని ఆయన మంగళవారం హైదరాబాదులోని మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా తెలంగాణ సాధన కోసం కృషి చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణలో 800 మందికి పైగా మరణించిన తర్వాత మంత్రులపై కఠిన పదాలు వాడటం సమంజసమేనని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఇవ్వని బిజెపిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన అన్నారు. జెఎసితో కలిసి పోవాల్సిన అవసరం తమకు కనిపించడం లేదని ఆయన అన్నారు. సీమాంధ్ర వల్ల తెలంగాణ వెనకబడిందనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. రాజకీయాలు జడపదార్థాలు కూకూడదని ఆయన అన్నారు.

English summary
Telangana political JAC chairman Kodandaram met union minister Vayalar Ravi and urged to resolve Telangana issue as early as possible. Ha said that no alternative for bifurcation of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X