కూలిన మెట్రో వంతెన: ఒకరు మృతి, 7గురికి గాయాలు

ప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. ముగ్గురిని రక్షించారు. అధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాల వల్ల అది కూలి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల వల్ల నగరంలో నీరు నిలిచిపోయింది.
రెండు ఫైరింజన్లు, ఓ అంబులెన్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద మరి కొంత మంది ఉండవచ్చునని ప్రత్యక్షులు అంటున్నారు. సంఘటనా స్థలం వద్ద ప్రజలు పెద్ద యెత్తున గుమికూడారు.
ఈ మెట్రో వంతెన విమానాశ్రయానికి దారి తీస్తుంది. ఇది కూలడంతో రద్దీగా ఉండే వ్యాపార ప్రాంతంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. ముంబై రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఈ ప్రమాదం సంభవించింది.












Click it and Unblock the Notifications