50 పెళ్లిళ్ల కిలాడీని గుర్తించడంలో తడబడ్డ పోలీసులు

Shahnaz
చెన్నై: యాభై పెళ్లిళ్ల కిలాడీ షహనాజ్‌ను అరెస్టు చేసే సమయంలో చెన్నై పోలీసులు కాస్త తడబడ్డారట. అరెస్టు సమయంలో బెంగుళూరు బస్టాండ్‌ ప్రాంతంలో ఉన్న షహనాజ్ మేకప్ లేకుండా వుండడంతో పోలీసులు ఆమెను గుర్తించడంలో కాస్త తడబాటుకు గురయ్యారట. దీనికి సంబంధించి ఓ పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ మేకప్‌తో మాత్రమే ఆమె ఫోటోలను చూసిన నేపథ్యంలో నేరుగా మేకప్ లేకుండా ఉన్న షహనాజ్‌ను గుర్తించడం కష్టతరమైందని తెలిపారు.

కాగా తాను కేవలం నలుగురిని మాత్రమే వివాహమాడానని, యాభై మందిని కాదని నిత్య పెళ్లి కూతురు కిలాడీ లేడీ షహనాజ్ అరెస్టు తర్వాత పోలీసులకు తెలిపింది. యాభై వరకు పెళ్లిళ్లు చేసుకొని మగాళ్లను మోసగించిందని కేరళ కిలాడీ లేడి షహనాజ్‌ను పోలీసులు నాలుగు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

తాను కేవలం డబ్బు, విలాస జీవితం కోసమే ప్రేమ నాటకాలు ఆడినట్లు చెప్పుకొచ్చింది. తాను 50 మందిని కాకుండా కేవలం ఐదుగురిని మాత్రమే పెళ్లి చేసుకొని కాపురం చేసినట్లు తెలిపింది. వేర్వేరు నెంబర్లను కలిగి వున్న కారణంగా ఎవరికీ తనపై అనుమానం రాలేదని, అయితే స్నేహాలు ఎక్కువ కావడంతో బయటపడాల్సి వచ్చిందని వాపోయింది. బెంగుళూరుకు పారిపోకముందు తాను ఆంధ్ర, కేరళ ప్రాంతాలలో తలదాచుకున్నట్టు తెలిపింది.

మరోవైపు నిత్య పెళ్లికూతురు హెషనాజ్ ఆరు నెలల గర్భవతిగా తేలిన విషయం తెలిసిందే. ఆమెకు ఆదివారంనాడు సాయంత్రం ట్రిప్లికేన్‌లోని కస్తూర్బా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ విషయం తేలింది. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రెవరనే విషయాన్ని నిర్ధారించడానికి డిఎన్ఎ పరీక్షలు చేయాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.

షెహనాజ్ బెయిల్ కోరుతూ చెన్నై సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంది. గర్భవతిని అయిన తనకు మానవతా దృక్పథంతో బెయిల్ ఇవ్వాలని ఆమె కోర్టును కోరింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుంది. ముప్పై ఏళ్ల ఆ మహిళను చెన్నై పోలీసులు సెప్టెంబర్ 1వ రాత్రి బెంగళూర్‌లోని మెజిస్టిక్ ప్రాంతంలో గల ఓ ప్రైవేట్ అతిథి గృహంలో ఊన్నట్లు సమాచారం అందుకుని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+