శివకాశీలో భారీ పేలుడు: 52 మంది మృతి

ఈ ప్రమాదం కారణంగా ఫ్యాక్టరీలోని దాదాపు 40 గదులు ధ్వంసమయ్యాయి. ఉదయం దాదాపు మూడు వందల మంది పనివాళ్లు ఫ్యాక్టరీలోకి వెళ్లారు. శక్తికి మించి తాయారీ, తక్కువ స్థలంలో ఎక్కువ పని, ఎక్కువ మోతాదులో బాణాసంచా నిలువలు ఈ ఫ్యాక్టరీలో ఉన్నాయని భావిస్తున్నారు. గాయాలైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పది ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది.
ఈ ఫ్యాక్టరీలో 45 గదులలో క్రాకర్స్ ఉత్పత్తిని చేస్తున్నారు. భారీ పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల వాళ్లు ఒక్కసారిగా భయపడ్డారు. కాగా ఇప్పటి వరకు 50 మంది మృతి చెందినట్లుగా చెబుతున్నా మృతుల సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉండనుందని చెబుతున్నారు. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఆలస్యంగా రెస్య్యూ టీం చర్యలు ప్రారంభించింది.
తీవ్రంగా గాయపడ్డ వారిని మొదట శివకాశీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారిని మధురై ఆసుపత్రికి తరలించారు. ఈ సంవత్సరం నాలుగు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. కానీ కొన్ని ఏళ్ల తర్వాత శివకాశీలో ఇంత పెద్ద ప్రమాదం మళ్లీ జరిగింది. కాగా ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని రక్షించేందుకు వెళ్లిన పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద కొందరు కార్మికులు చిక్కుకు పోయారు. ప్రమాద ప్రాంతంలో దట్టంగా పొగ కమ్ముకోవడంతో 25 మంది వరకు స్పృహ తప్పి పడిపోయారు.












Click it and Unblock the Notifications