లోకేష్‌కు పార్టీ బాధ్యతల వార్తల్లో నిజం లేదు: ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని మీడియాలో వచ్చిన వార్తలను తెలుగుదేశం శాసనసభ్యుడు, పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. లోకేష్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

బాబ్లీ ప్రాజెక్టు సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ఈ నెల 18వ తేదీలోగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మాట్లాడి రాష్ట్రానికి న్యాయం చేయాలని ఆయన అన్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో ప్రధాని బాబ్లీ ప్రాజెక్టు వివాదంపై మాట్లాడాలని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎల్లుండి నుంచి చర్చిస్తారని ఆయన చెప్పారు.

డెల్టాకు చెందిన 22 వేల ఎకరాలక ఆయకట్టుకు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడాన్ని తెలుగుదేశం పార్టీ మరో నాయకుడు కొడెల శివప్రసాద రావు తప్పు పట్టారు. ఒక పార్లమెంటు సభ్యుడి రాజీనామాకు భయపడి ఆయకట్టుకు నీరు ఇవ్వకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. సమస్యలపై కలవడానికి తీరికలేని మంత్రులు కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు నిర్వహించిన డైరీ వేడుకలకు ఎలా హాజరయ్యారని ఆయన అడిగారు.

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటి విడుదలను ఆపకపోతే తాను రాజీనామా చేస్తానని కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. కోడెల శివప్రసాద రావు ఎస్పీవై రెడ్డి ఉదంతాన్నే తీసుకుని మాట్లాడారు. కాగా, నారా లోకేష్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+