వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెవిపి వందసార్లు తిరిగారు: పాల్వాయి, కిరణ్‌పై శంకరన్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

Palvai Goverdhan Reddy
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రపై పుస్తకాన్ని ఆవిష్కరించిన రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు ఆ పుస్తకంలో తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సందేశం కోసం తొమ్మిది నెలలు 10 జన్‌పథ్ చుట్టూ తిరిగారని అన్నారు. వైయస్ పాదయాత్ర పుస్తకావిష్కరణకు నేతలను తీసుకు వచ్చేందుకు కెవిపి బాగా కష్టపడ్డారన్నారు. ఒక్కో నేతను రప్పించేందుకు వందసార్లు బతిమాలారన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసే ఏ కార్యక్రమమైనా అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికే లబ్ధి చేకూరుస్తుందని పాల్వాయి అభిప్రాయపడ్డారు. ఏ ఒక్క కాంగ్రెసు నేత కూడా పుస్తకావిష్కరణకు మనస్ఫూర్తిగా వెళ్లలేదన్నారు. కెవిపి ఒకటికి వందసార్లు బతిమాలడం వల్లనే వెళ్లారన్నారు. రాష్ట్రంలో జలయజ్ఞంపై ఉన్నతస్థాయి దర్యాఫ్తునకు ఆదేశిస్తానని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారన్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన, హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి పైన మాజీ మంత్రి శంకర రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి స్మగ్లింగ్ కేసులో రంపచోడవరం ఎఎస్పీని బలి చేశారని మండిపడ్డారు. ఎస్పీని సస్పెండ్ చేసి నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కలెక్షన్ల కోసమే సబిత తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వెళ్లారని ఆరోపించారు.

నేరస్తులను పోలీసు ఉన్నతాధికారులు ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఎస్పీని అనవసరంగా బలి చేశారన్నారు. కిరణ్ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదన్నారు. కిరణ్ సిఎంగా ఉంటే పార్టీకి నష్టమన్నారు. మౌలాలీలో రహేజాకు ఇచ్చిన 26 ఎకరాలు దుర్వినియోగం అయ్యాయని, వాటిని ప్రభుత్వం తక్షణే స్వాధీనం చేసుకోవాలన్నారు.

English summary
Congress party senior leader Palvai Goverdhan Reddy 
 
 said on Sunday that KVP Ramachandra Rao was round at 
 
 10 Janpath for 9 month to Sonia Gandhi's message in YS 
 
 Padayatra book.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X