ఒకేలా ఉన్నారని నంబర్లతో గుండు: తల్లి ఐడియా

Mother shaves numbers on heads
బీజింగ్/మాస్కో: తన నలుగురు తనయులు ఒకేలా ఉండటంతో వారిని గుర్తించడంలో తండ్రి సహా అందరూ పొరబడుతున్న నేపథ్యంలో ఓ తల్లి వారికి 1, 2, 3, 4 అని గుండు గీయించి కన్ఫూజన్ లేకుండా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. చైనాకు చెందిన టాన్ చావోయున్‌కు నలుగురు కొడుకులు. వారు ఒకరికి ఒకరు అచ్చు గుద్దినట్లుగా ఉంటారు. వారిని కేవలం తల్లి చావోయిన్ మాత్రమే గుర్తించగలదు. పాఠశాలలో గానీ, బయట గానీ ఎవరూ వారిలో ఎవరు ఎవరో గుర్తించలేరు. చివరకు తండ్రి కూడా పొరబడుతుంటారు.

దీంతో ఆ తల్లి తన నలుగురు కొడుకులకు వరుసగా నెంబర్లతో గుండు గీయించింది. దీనిపై ఆమె చైనీస్ పేపర్స్‌తో మాట్లాడుతూ.. తన కొడుకులు నలుగురు ఒకేలా ఉంటారని, దీంతో గుర్తించడంలో అందరూ ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు వారి తండ్రి కూడా వారిని బాగా గుర్తు పడుతున్నారని చెప్పారు.

ముఖ్యంగా పాఠశాలలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు తన ఆరేళ్ల కుమారులను గుర్తు పట్టేందుకు సులభంగా ఉంటుందని ఇలా చేసినట్లు చెప్పారు. తన మూడో కొడుకు తప్పు చేస్తే తన భర్త ఇంతకుముందు రెండోవాడిని కొట్టిన సందర్భాలు ఉన్నాయని చావోయున్ చెప్పారు. ఇప్పుడు తన భర్తకు అలాంటి కన్ఫూజన్ లేదన్నారు.

యజమాని కోసం ప్రాణత్యాగం చేసిన శునకం

ఆత్మహత్యాయత్నం చేసిన తన యజమానిని ఓ శునకం కాపాడి తన ప్రాణాలు పోగొట్టుకుంది. ఖజకిస్తాన్‌లోని కారాగాండా నగరం వద్ద ఇది జరిగింది. జీవితంపై విరక్తి చెందిన యజమాని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మందు తాగి రైలు పట్టాలపై పడుకున్నాడు. రైలు వస్తున్న సమయంలో దీనిని పసిగట్టిన ఆయన పెంచుకున్న శునకం అతడిని పట్టాల పైనుండి బయటకు ఈడ్చింది. యజమానిని కాపాడిన శునకం మాత్రం రైలు కింద పడి మరణించింది. అతను స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+